'రాహుల్' కు ఓ ముద్దు !

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు ఓ విచిత్రమైన సంఘటన ఎదురైంది.ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీ గా తిరుగుతున్న రాహుల్ కు ఓ కాంగ్రెస్ కార్యకర్త ముద్దులు పెట్టడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

 Congress Worker Kisses Rahul Ghandi In Gujarath-TeluguStop.com

ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీనికి సంబంధించి వివరాలు పరిశీలిస్తే… గుజరాత్ రాష్ట్రంలో ప్రస్తుతం రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా వల్సద్‌లో నిర్వహిస్తున్న పోటీలో పాల్గొనడానికి రాహుల్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఒక వేదికపై రాహుల్ కూర్చున్నారు.

ఆయనను కలిసేందుకు కొంత మంది మహిళా కార్యకర్తలు వేదిక పైకి వచ్చారు.వారితో మాట్లాడేందుకు రాహుల్ పైకి లేచి నిలబడ్డారు.ఈ సమయంలోనే వేదిక పైన ఉన్న ఓ మహిళా కార్యకర్త రాహుల్ కు ముద్దు పెట్టేసింది.అయితే అనుకోకుండా జరిగిన ఈ పరిణామంతో షాక్ తిన్న రాహుల్ వెంటనే తేరుకుని ఆమెను పలకరించి చిరునవ్వు నవ్వాడు.

అనంతరం అదే మహిళ రాహుల్ కి పూలదండ వేసి మరి ఆయనతో సంభాషించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube