క్రేజ్ తగ్గుతోంది... గ్రాఫ్ పడిపోతోంది ! ఇలా అయితే కష్టమే

గత ఎన్నికల ముందు బీజేపీ పేరు చెప్తే చాలు అందరికి నరేంద్ర మోదీ గుర్తుకువచ్చేవాడు.ఎక్కడ చుసిన ఆయన గురించే చర్చలు నడిచేవి… ఆయన పనితీరుకు గుజరాత్ అభివృద్ధిని నమూనాగా చెప్పుకుని దేశమంతా నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని తహతహలాడిపోయాయి.

 Congress Will Win In 2019 Elections In India-TeluguStop.com

అనుకున్నట్టే ఆయన ప్రధానమంత్రి అయిపోయారు.కానీ ప్రజలు ఆశించినంత స్థాయిలో మాత్రం తన పనితీరుతో మోదీ ఆకట్టుకోలేకపోయారు.

అవును ప్రస్తుతం బీజేపీ గ్రాఫ్ దేశవ్యాప్తంగా తగ్గిపోతూ వస్తోంది.ఆర్థిక సంస్కరణల పేరుతో మోదీ తీసుకున్న నిర్ణయాలు.

నోట్ల రద్దు, జీఎస్టీ వంటివి బీజేపీ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాయి.ఆహా ఓహో అన్నవాళ్లంతా ఇప్పుడు నోరు మెదపలేని పరిస్థితికి వచ్చారు.

ఇటీవల ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమి చెందిన తర్వాత…జాతీయ రాజకీయాల్లో ఓ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.రాబోయే ఎన్నికల్లో బీజేపీకి అధికారం దక్కడం అనేది కలగానే మిగిలే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.గత ఎన్నికల్లో సొంతంగా మెజార్టీ సాధించిన బీజేపీకి … ఈ సారి సొంతంగా వంద సీట్లు కూడా వస్తాయా రావా అనే సందేహం అందరిలోనూ కనిపిస్తోంది.దీనికి కారణం బీజేపీకి బాగా పట్టున్న నియోజకవర్గాల్లో సైతం ఎదురుగాలి స్పష్టంగా వీయడమే.

ఉత్తరప్రదేశ్‌లో 80 సీట్లు ఉంటే గత ఎన్నికల్లో బీజేపీ 71 స్థానాలను గెలుచుకుంది.ఇప్పటికే దశాబ్దాలుగా గెలుస్తూ వస్తున్న లోక్ సభ సీట్లను ఉపఎన్నికల్లో పోగొట్టుకుంది.ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ కూటమిగా గెలిస్తే.ఈ 71 సంఖ్య 20 కన్నా తగ్గే అవకాశం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అంతే కాదు వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ గెలుపు కూడా కష్టమే అన్నట్టుగా అక్కడ పరిస్థితులు నెలకొన్నాయి.అలాగే.గుజరాత్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్‌లో బీజేపీ గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది.ఇప్పుడు గుజరాత్‌లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.సగం సీట్లు వస్తే గొప్ప అన్నట్టుగా ఉంది.ఢిల్లీ.

జార్ఘండ్, ఉత్తరాఖండ్.లలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది.

తాజాగా కాంగ్రెస్ జెండా రెపరెపలాడించిన రాజస్థాన్, మధ్య ప్రదేశ్‌, చత్తీస్ ఘడ్‌లలో బీజేపీకి గడ్డుకాలమే అనడంలో సందేహం లేదు.ఒకప్పుడు ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కి ఎదురుగాలి బాగా వీసింది.

ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు గత ఎన్నికల్లో వచ్చింది ఒకే ఒక్క లోక్ సభ సీటు.కానీ ఇప్పుడు అదే పరిస్థితి బీజేపీకి వచ్చింది.

దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో గత ఎన్నికల్లో బీజేపీ నుంచి 17మంది గెలిచారు.కానీ ఈ సారి అక్కడ సింగల్ డిజిట్లోనే సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఇలా ప్రతి రాష్ట్రంలోనే బీజేపీ తీవ్రమైన ఎదురుగాలి వీస్తుండడంతో… మళ్లీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే కనిపించడంలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube