రావాలి జగన్.. కావాలి జగన్ అంటున్న కాంగ్రెస్ ?  

Congress Wants To Support Ys Jagan-congress,modi,ys Jagan,కాంగ్రెస్ పార్టీ,జగన్

రాజకీయాల్లో ఎప్పుడు ఎవరితో విరోధం పడుతుందో, ఎవరితో స్నేహం అవసరం అవుతుందో ఎవరూ చెప్పలేరు. తమ తమ రాజకీయ అవసరాల కోసం అపటి వరకు దుమ్మెత్తిపోసుకున్న పార్టీలే ఆ తరువాత స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అంటూ పాటలు పాడుకుంటూ ఉంటాయి. ఇదంతా రొటీన్ గా జరిగిపోయే అంశమే..

రావాలి జగన్.. కావాలి జగన్ అంటున్న కాంగ్రెస్ ? -Congress Wants To Support YS Jagan

సరిగ్గా ఇలాగే ఇప్పుడు ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మచ్చిక చేసుకునే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. గతంలో జగన్ జైలుకి వెళ్ళడానికి కారణం అయిన కాంగ్రెస్ పార్టీ ఆ పాత సంగతులు అన్ని మర్చిపోయి జగన్ గతంలో కాంగ్రెస్ పార్టీ గూటి పక్షే అంటూ కొత్త రాగం అందుకుంది. అయితే ఇదంతా రాజకీయ ఎత్తుగడలో భాగంగానే అన్న సంగతి అందరికి స్పష్టంగా తెలుసు.

ప్రస్తుతం ఏపీలో వైసీపీకి అనుకూల పవనాలు ఉండడంతో కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరం అయిన మద్దతు జగన్ ఇస్తాడనే ఆశతో కాంగ్రెస్ రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఆ పనిని కాస్తా మొన్నటి వరకూ జగన్ తమ ప్రధాన శత్రువు అని ప్రకటించిన ఉమెన్ చాందీకే అప్పగించిందట కాంగ్రెస్ అధిష్టానం. ఇక ఆయన ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగిపోయారట. వైసీపీలో కీలకంగా ఉన్న నాయకులు కొందరికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు మీడియాలో ప్రధాన వార్తలుగా వస్తున్నాయి.

జగన్ కేంద్రంలో తమకే మద్దతను ఇవ్వాలని కోరుతోంది కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ విషయంలో జగన్ తన మనసులో మాట పార్టీ కీలక నాయకుల దగ్గర చెప్పేస్తున్నారట. తనకు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఫర్వాలేదు అని ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే పార్టీకే తాను మద్దతు ఇస్తాను అని చెబుతున్నాడట..

జగన్ ఈ విధంగా చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ లో ఆశలు చిగురించడానికి కారణం అయ్యాయట.అందుకే జగన్ మోహన్ రెడ్డి మావాడే, మా కాంగ్రెస్ నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు అంటూ జగన్ మీద ఎక్కడలేని ప్రేమను వలకబోస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ ఈ విధమైన డైలాగులు వదిలారు.

ఇక అక్కడితో సరిపెట్టలేదు. టీడీపీ కి ఎంపీ సీట్లు రావనే ఊహతో చంద్రబాబు మీద కూడా ధ్వజమెత్తారు చింతామోహన్. చంద్రబాబు నాయుడు అవకాశవాది అని, అవసరం కొద్దీ అన్ని పార్టీల చుట్టూ తిరుగుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు అంటూ విమర్శలు గుప్పించారు