క‌రీంన‌గ‌ర్ జిల్లా క్యాండిడేట్ కావాలంటున్న కాంగ్రెస్‌.. అందుకే సురేఖ‌ను వ‌ద్దంటున్నారా..

తెలంగాణ‌లో ఏదైనా హాట్ టాపిక్ ఉందా అంటే ఒక్క హుజూరాబాద్ మాత్రమే అని చెప్ప‌క త‌ప్ప‌దు.ముందు నుంచే ప్ర‌ధాన అంశంగా వెలుగొందుతున్న హుజూరాబాద్ రాజ‌కీయం ఎన్నో మ‌లుపులు తిరుగుతోంది.

 Congress Wants Karimnagar District Candidate Is That Why They Are Pushing For Su-TeluguStop.com

పోటీ ఇస్తార‌నుకున్న వారు ప‌క్క‌కు వెళ్తుండ‌టం ఉనికిలో లేని వారు పైకి వ‌స్తుండ‌టం ఇక్క‌డ మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు.అయితే బీజేపీ నుంచి మొద‌టి నుంచి ఈట‌ల రాజేంద‌ర్ బ‌లంగా క్యాండిడేట్‌గా నిలుచున్నా కూడా టీఆర్ ఎస్ విష‌యంలో మాత్రం చాలా ర‌కాల మ‌లుపులు జ‌రిగాయి.

ఇక కాంగ్రెస్ విష‌యానికి వ‌స్తే క్యాండిడేట్ అవుతాడనుకున్న కౌశిక్‌రెడ్డి టీఆర్ ఎస్‌లో జాయిన్ అయిపోయారు.

ఇక అప్ప‌టి నుంచి కాంగ్రెస్‌కు బ‌ల‌మైన క్యాండిడే్ దొర‌క‌ట్లేదు.

దీంతో వారంతా కూడా మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు.ఇంకోవైపు టీఆర్ ఎస్‌, బీజేపీ పార్టీలు వ‌రుస మీటింగులు అలాగే ప్ర‌చ‌రాల‌తో హోరెత్తిస్తుంటే కాంగ్రెస్‌కు మాత్రం ఇంకా క్యాండిడేట్లు కూడా దొర‌క‌ట్లేదు.

ఇక ఇప్పుడు కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి అయిన కొండా సురేఖ పేరు బ‌లంగా వినిపిస్తోంది.అయితే ఈమె పేరు కూడా చాలా ర‌కాలుగా ఆలోచిస్తున్నార‌ని తెలుస్తోంది.

ఎందుకంటే ఆమె నాన్ లోక‌ల్ క్యాండిడేట్ కావ‌డంతో బాగా వ్యతిరేకత పెరుగుతోందట.హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఎలాగైనా స‌రే స్ధానిక నేతలనే బ‌రిలోకి దింపాలని ఇక్క‌డి పార్టీ నేత‌లు కోరుతున్నారు.

Telugu Congress, Etela Rajender, Karimnagagar, Konda Surekha, Koushik Reddy, Can

ఇక్కడ మ‌రో విష‌యం ఏంటంటే హుజూరాబాద్ నియోజకవర్గంలో అంత బ‌ల‌మైన క్యాండిడేట్లు లేక‌పోతే మాత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోకి ఈ నియోజ‌క‌వ‌ర్గం వస్తుంది కాబ‌ట్టి ఈ జిల్లాకు చెందిన నేత‌ల‌త‌నే పోటీలోకి దింపాల‌ని, అది కాకుండా వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖను ఎలా నిల‌బెడుతారంటూ స్థానిక కార్య‌క‌ర్త‌లు తీవ్రా ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.అయితే ఈ ఎన్నిక‌ల్లో ఎలాగూ గెల‌వ‌మ‌నే ఈ విధంగా అధినేత‌లు చేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు.మ‌రి సురేఖ‌పై ఈ స్థాయిలో వ‌స్తున్న వ్య‌తిరేక‌త నేప‌థ్యంలో స్థానికి నేత‌ల‌కు అవ‌కాశం ఇస్తారా లేదా అన్న‌ది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube