కాంగ్రెస్‌, బీజేపీ ఢీ కొడితేనే బీఆర్‌ఎస్ కి ప్రయోజనం

తెలంగాణలో మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీకి తాము పోటీ అంటే తాము పోటీ అన్నట్లుగా కాంగ్రెస్ మరియు బీజేపీలు పోటా పోటీగా మాటలు యుద్ధం మొదలు పెట్టాయి.

 Congress Vs Bjp And Brs Leaders Happy , Congress , Brs , Ts Politics , Etela Ra-TeluguStop.com

బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆ మధ్య ఒక ఉప ఎన్నికల ప్రచారం కోసం కేసీఆర్ ఏకంగా 25 కోట్ల రూపాయలను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాడని ఆరోపించాడు.రేవంత్ రెడ్డి ఆ డబ్బులను తీసుకొని ఎన్నికల్లో ప్రచారం కి ఖర్చు చేశాడని కూడా ఈటెల ఆరోపించారు.

Telugu Bandi Sanjay, Congress, Etela, Etela Rajender, Revanth Reddy, Ts-Politics

ఈటెల ఆరోపణలకు తీవ్రంగా స్పందించిన రేవంత్ రెడ్డి ప్రమాణానికి సిద్ధమయ్యాడు.ఎలాంటి ప్రమాణం చేస్తే ఎందుకైనా సిద్ధమని తనపై అలాంటి ఆరోపణలు చేయడం దారుణం అంటూ ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్న రేవంత్ రెడ్డి వార్తలు నిలిచాడు.తాజాగా రేవంత్ రెడ్డి ( Revanth Reddy )మరియు ఈటెల రాజేందర్ మధ్య సాగుతున్న మాటల యుద్ధం తార స్థాయికి చేరడంతో బీఆర్ఎస్ పార్టీ( BRS party ) నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Bandi Sanjay, Congress, Etela, Etela Rajender, Revanth Reddy, Ts-Politics

వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయం నాటికి బిజెపి మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య ఇదే తరహాలో వేడివేడి రాజకీయం కొనసాగితే కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరుతుందని.తద్వారా మరోసారి అధికారం దక్కుతుందని కేసీఆర్ మరియు ఇతర బీఆర్‌ఎస్‌ నాయకులు భావిస్తున్నారట.ప్రస్తుతం బిజెపి రెండవ స్థానం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Bandi Sanjay, Congress, Etela, Etela Rajender, Revanth Reddy, Ts-Politics

అయితే బిజెపి( BJP ) మాత్రం అధికారం తప్పించుకోవడమే మా లక్ష్యం అన్నట్టుగా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీతో పెట్టుకున్న వివాదం కారణంగా ఆ పార్టీకి కూడా బలం చేకూరి అవకాశాలుంటాయి.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి ఆ ఓట్లు అన్నీ ఒక్క పార్టీకి దక్కితే ఆ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశం ఉంటుంది.అదే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే కచ్చితంగా అధికార పార్టీకే బలం చేకూరినట్లు అవుతుంది.

మరోసారి అధికార పార్టీ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉంటాయి.ఇప్పుడు అదే సిద్ధాంతం బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో చర్చ జరుగుతుంది.

కాంగ్రెస్ మరియు బిజెపి ఎంత కొట్టుకుంటే ఎంత మంచిది అన్నట్లుగా వారు చూస్తూ ఊరుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube