టీఆర్ఎస్ పిలుస్తోంది ... కాంగ్రెస్ రమ్మంటోంది ! పెద్దిరెడ్డి రూటు ఎటో ?

హుజూరాబాద్ ఎన్నికల దృష్ట్యా ఏ చిన్న నాయకుడు పార్టీలో చేరదామని అనుకున్నా, పెద్ద హడావుడి నడుస్తోంది.ప్రతి పార్టీ పెద్ద ఎత్తున నాయకులను చేర్చుకుని బలోపేతం అవ్వాలని చూస్తున్నాయి.

 Congress Trs Pressures Peddireddy To Join Their Party Trs, Telangana, Bjp, Peddi-TeluguStop.com

ఇక హుజూరాబాద్ నియోజకవర్గంలో పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు.ప్రతి పార్టీ పెద్ద ఎత్తున చేరికలు ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఇతర పార్టీలోని అసంతృప్త నేతలు ఇదే సరైన సమయం గా ఆ పార్టీలకు రాజీనామా చేసి తమ విలువ మరింత పెంచుకుని ఇతర పార్టీలు ప్రాధాన్యం ఉండేలా చూసుకుని మరి జంపింగ్  చేస్తున్నారు.ఈ క్రమంలోనే మాజీ మంత్రి బీజేపీ నేత పెద్దిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

       పార్టీలోకి ఈటెల రాజేందర్ ను చేర్చుకునే  సమయంలో కనీసం ఆ నియోజకవర్గానికి చెందిన తనను సంప్రదించలేదని , గతంలో ఇక్కడ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను అని , అయినా, తనను పట్టించుకోలేదని పెద్దిరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.ఈ క్రమంలో ఆయన ఏ పార్టీలో చేరతారనే ఆసక్తి నెలకొంది.

ఇప్పుడు ఆయనకు టిఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి ఆహ్వానాలు అందాయి.ఈ రెండు పార్టీలు ఇంకా తమ అభ్యర్థి ఎవరనేది డిసైడ్ కాకపోవడంతో,  పెద్దిరెడ్డి సైతం తనకు టిక్కెట్ ఇచ్చే పార్టీ లో చేరాలని చూస్తున్నారు.

పెద్దిరెడ్డి టిడిపిలో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి తో ఉన్న సన్నిహిత సంబంధాలు కారణంగా ఆయనను తమ పార్టీలో చేరుతారు అని రేవంత్ రెడ్డి భావిస్తూ పెద్దిరెడ్డి పై ఒత్తిడి చేస్తున్నారు.
   

Telugu Congress, Hujurabad, Peddi, Revanth Reddy, Telangana-Telugu Political New

    అంతే కాదు అవసరమైతే కాంగ్రెస్ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తామను  రేవంత్ ప్రతిపాదనలు కూడా చేసినట్లు తెలుస్తోంది.ఇక టిఆర్ఎస్ విషయానికొస్తే ఇప్పటికే పెద్దిరెడ్డి కేసీఆర్ ను కలిసినట్లు సమాచారం.ఆయన రాజకీయ భవిష్యత్తుపై టిఆర్ఎస్ నుంచి స్పష్టమైన హామీ కూడా వచ్చినట్లుగా పెద్దిరెడ్డి అనుచరులు  ప్రచారం చేస్తున్నారు.

ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్, టీఆర్ఎస్లోలలో ఏ పార్టీలో చేరతారనేది ఉత్కంఠగా మారింది.పెద్దిరెడ్డి మాత్రం తనకు టికెట్ ఇచ్చే పార్టీ వైపు వెళ్లాలని, హుజురాబాద్ ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube