కాంగ్రెస్ ఎత్తులకు టీఆర్ఎస్ పై ఎత్తులు... చివరికి గెలిచి నిలిచేదెవరు?

తెలంగాణలో మరో రాజకీయ సమరం జరగబోతోంది.నాగార్జున సాగర్ త్వరలోనే ఉప ఎన్నిక జరగబోతోంది.

 Congress And Trs Leaders Political Plans In Nagarjuna Sagar By Elections,  Nagar-TeluguStop.com

ఇప్పటికే అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని మొదలు పెట్టాయి.ఇక టీఆర్ఎస్ ఇప్పటికే ఒక్కో ఎమ్మెల్యేకు ఇంచార్జ్ లను నియమించి ప్రచారాన్ని హోరెత్తిస్తోంది.

ఇప్పతికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించారు.టీఆర్ఎస్ విమర్శనాత్మక ప్రసంగాలు, ప్రెస్ మీట్లతో రాజకీయంగా హీట్ ను పుట్టిస్తోంది.

అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే ఓ ప్రచార సభను ఏర్పాటు చేసి టీఆర్ఎస్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.టీఆర్ఎస్ హయాంలో నాగార్జున సాగర్ ను అభివృద్ధి చేసింది ఏమీ లేదని, జానారెడ్డి చేసిన అభివృద్ధి ఇంకా కనిపిస్తోందని జానారెడ్డి, కాంగ్రెస్ నేతలు మండి పడ్డారు.

అయితే కాంగ్రెస్ పార్టీ వామపక్షాల మద్దతు కోరింది.అయితే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ వ్యూహాన్ని జాగ్రత్తగా గమనిస్తూనే వారికి వ్యూహానికి మించిన వ్యూహాన్ని సిద్దం చేసే పనిలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

టీఆర్ఎస్ కూడా జానారెడ్డి పై ప్రజల ఫోకస్ వెళ్ళకుండా జానారెడ్డి ఏమీ అభివృద్ధి చేయలేదనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగితే టీఆర్ఎస్ సగం విజయం సాధించినట్లే అవుతుంది.ఏది ఏమైనా కాంగ్రెస్ ఎత్తులకు టీఆర్ఎస్ పై ఎత్తులు వేస్తూ ఇరు పార్టీలు రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube