గ్రేట‌ర్ లో ఆ పార్టీ ఓట‌మి ముందే డిసైడ్ అయ్యిందా... !

గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పుంజుకుంటుంద‌ని.పున‌ర్ వైభ‌వం దిశ‌గా అడుగులు వేస్తుంద‌ని భావిస్తున్న నాయ‌కులకు చెమ‌ట‌లు ప‌డుతున్నాయి.

 Congress Leaders Not Started Campaign Yet, Ghmc Elections Campaign, Kishan Reddy-TeluguStop.com

ఒక‌వైపు మ‌రో జాతీయ పార్టీ బీజేపీ గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని ముందుకు సాగుతోంది.అతిర‌థ మ‌హార‌థులు ఇక్క‌డ పాగా వేసి మ‌రీ ప్ర‌చారం చేస్తున్నారు.

స్థానిక‌మే అయినా.సార్వ‌త్రికాన్ని మ‌రిపించేలా ఎన్నిక‌ల ప్ర‌చారం ఊద‌ర‌గొడుతున్నారు.

దాదాపు ఎనిమిది మంది కేంద్ర మంత్రులు ప్ర‌చారాన్ని ప‌రుగులు పెట్టిస్తున్నారు.అదే స‌మ‌యంలో దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీనే నేరుగా రంగంలోకి దిగుతున్నారు.

ఆయ‌న ప్ర‌చారం చేస్తే.ఇక‌, బీజేపీకి తిరుగు ఉండ‌ద‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

ఇక‌, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా కూడా ఇప్ప‌టికే రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు.కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, కిష‌న్‌రెడ్డి ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు.భౌతికంగా కిష‌న్ రెడ్డి ప‌ర్య‌టిస్తున్నారు.ఇరానీ మాత్రం ఆన్‌లైన్‌లో ప్ర‌చారం చేస్తున్నారు.

ఒక జాతీయ పార్టీ.అందునా దేశంలో అధికారంలో ఉన్న పార్టీ ఇలా గ్రేట‌ర్‌ను స‌వాలుగా తీసుకుని ముందుకు సాగుతుంటే.

కాంగ్రెస్‌.వ‌రుస ప‌రాజ‌యాలతో ముందుకు సాగుతున్న పార్టీ మాత్రం గ్రేట‌ర్‌ను పెద్ద స‌వాలుగా తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Telugu Congress, Ghmc, Hyderabad, Revanth Reddy-Political

నాయ‌కులు స్థానికంగా ప్ర‌చారం చేస్తున్నా. ప్ర‌ధాన మీడియా ఫోక‌స్ అంతా కూడా బీజేపీ, టీఆర్ఎస్ ‌పైనే ఉంది.ప్ర‌జ‌ల్లోనూ ఈ రెండు పార్టీల‌పైనే చ‌ర్చ సాగుతోంది.ఈ క్ర‌మంలో కాంగ్రెస్ అభిమానులు త‌ల్ల‌డిల్లుతున్నారు.మా రాహుల్ ఎక్క‌డ‌? అని వారు ప్ర‌శ్నిస్తున్నారు.రాహుల్ త‌న మాతృమూర్తి కోసం.

గోవాలో ఉన్నార‌ని కాంగ్రెస్ నాయ‌కులు స‌ర్ది చెబుతున్నారు.వాస్త‌వానికి గోవా హైద‌రాబాద్‌కు పెద్ద దూరం కాదు.

అయినా.కూడా ఆయ‌న రావ‌డం లేదు.

ప్ర‌చారం విష‌యాన్ని ఇప్ప‌టికే నాయ‌కులు ప్ర‌స్థావించినా.ఆయ‌న పెద్ద‌గా సీరియ‌స్‌గా తీసుకోలేదు.

దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక‌విధ‌మైన నిరాస‌క్త‌త రాజ్య‌మేలుతోంది.అంతేకాదు.ప్ర‌జ‌ల్లోనూ కాంగ్రెస్‌పై పెద్ద‌గా చ‌ర్చ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.వాస్త‌వానికి వ‌ర‌ద బాధితుల‌కు తాము గ్రేటర్ ప‌గ్గాలు చేప‌డితే.

ఇంటికి యాభై వేలు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు.అయినా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు.

నేత‌లు కూడా నిరుత్సాహంతోనే ఉన్నారు ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ ఓట‌మి ముందుగానే డిసైడ్ అయింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube