మండలి రగడ ...కోర్టుకెక్కిన కాంగ్రెస్ ...!

మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు … తెలంగాణ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ ఝలక్ మీద ఝలక్ ఇస్తోంది.ఇప్పటికే… ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కొద్ది పాటి బలం ఉన్న ప్రత్యర్థి పార్టీల్లోని కీలక నాయకులను కారు ఎక్కించేందుకు సిద్ధం అవుతోంది.తాజాగా… శాసనమండలిలో తమ పక్షాన్ని టిఆర్ఎస్ లో విలీనం చేయడాన్ని తప్పుపడుతూ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది.

 Congress To Approach High Court Against Merger Of Clp-TeluguStop.com

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ ఆలీ ఈ మేరకు ఉమ్మడి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.టిఆర్ఎస్ లో విలీనం చేయాలని పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్సీలు ప్రతిపాదనకు మండలి ఛైర్మన్‌ ఓకే చేయడం.మండలిలో కాంగ్రెస్‌ పక్షాన్ని టిఆర్ ఎస్ లో విలీనం చేస్తున్నట్టు ఈ నెల 21న అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఆదేశాలు జారీచేశారు.

ఈ ఉత్తర్వులనే సవాల్‌ చేస్తూ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌లో షబ్బీర్‌ అలీ పిటిషన్ దాఖలు చేశారు.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి, కౌన్సిల్‌ ఛైర్మన్‌, కేంద్ర ఎన్నికల కమిషన్‌, టిఆర్ఎస్ లో చేరిన నలుగురు ఎమ్మెల్సీలను ప్రతివాదులుగా చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్ సెలవులో ఉండడంతో ఈ నెల 26న ఈ పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube