నాగార్జున సాగర్ లో గెలుపు దిశగా కాంగ్రెస్ వ్యూహాలు...

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారయిందని చెప్పవచ్చు.కాంగ్రెస్ రోజురోజుకు బలహీనంగా మారుతున్న పరిస్థితులలో ప్రజల్లో నమ్మకం కోల్పోతోంది.

 Congress Strategies For Victory In Nagarjuna Sagar , Janareddy, Congress Party-TeluguStop.com

దుబ్బాక నుండి మొదలుకొని గ్రేటర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇలా జరిగిన ప్రతి ఎన్నికలో కనీసం కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వలేక పోయింది.అయితే కాంగ్రెస్ లో అంతర్గత కలహాల వల్ల కాంగ్రెస్ సీనియర్లు ఆధిపత్య ధోరణితో తమకు తాముగా నష్ట పోవడమే కాకుండా పార్టీకి నష్టం కలిగించారు.

అయినా ఇప్పటికీ ఆ విషయంలో అంతర్మథ నం చెందినట్లు కనిపించడం లేదు.అయితే త్వరలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనుంది.

అయితే ఇక ఇది వరకు ఓటములను పక్కకు పెడితే నాగార్జున సాగర్ కాంగ్రెస్ కు కంచుకోట.ఇందులో జానారెడ్డి ఎన్నో ఏళ్లుగా గెలుపొందుతూ వస్తున్నాడు.

ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు ఓటమి పాఠాలు నేర్చుకొని నాగార్జున సాగర్ లో ఎన్నికల ప్రచార సభ నిర్వహించిన విషయం తెలిసిందే.అయితే ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నాగార్జున సాగర్ లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ నని, నాగార్జున సాగర్ కాంగ్రెస్ హయాంలోనే ఎక్కువ అభివృద్ధి జరిగిందని ప్రచారం నిర్వహిస్తున్నారు.

మరి కాంగ్రెస్ నాయకుల ప్రచారాన్ని ప్రజలు ఎంత వరకు విశ్వసిస్తారో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube