తేల్చుతారా తేల్చరా ? కాంగ్రెస్ లో రాజుకున్న 'రేవంత్' మంటలు  

Congress Seniours Leaders Not To Support To Revanth Reddy - Telugu Congress Working Party President, Revanth Reddy, Revanth Reddy Arrest, Revanth Reddy Join In Tdp To Congress, Sonia Gandhi, Telangana Congress Leaders, Uttam Kumar Reddy

ఎప్పుడు గ్రూపు తగాదాలతో, నిత్యం వివాదాల్లో ఉండే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విషయంలో ఒకటయ్యారు.గత కొంత కాలంగా రేవంత్ రెడ్డి దూకుడు ఎక్కువైందని, తమ ప్రభావం ప్రజల్లోనూ, అధిష్టానం దగ్గరా తగ్గిపోయిందని, అధిష్టానం కూడా రేవంత్ కు ఎక్కడలేని ప్రాధాన్యత ఇస్తూ ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని గుర్రుగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇప్పుడు రేవంత్ రెడ్డి అరెస్ట్ అవ్వడం, ఆయనపై భూకబ్జా ఆరోపణలు రావడం, తదితర అంశాలను హైలెట్ గా చేసుకుని ఇప్పుడు అధిష్టానం ముందే కాకుండా ప్రజల ముందు కూడా దోషిగా చూపించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

 Congress Seniours Leaders Not To Support To Revanth Reddy

దీనిలో భాగంగానే ఇప్పుడు ఆయన వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముందు లేవనెత్తడమే కాకుండా కొత్త డిమాండ్ ను తెరమీదకు తెచ్చారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంతా కలిసి మొదటి నుంచి రేవంత్ వ్యవహారం వివాదాస్పదం గానే ఉంటోందని, ఆయన సొంత అజెండాతో పని చేసుకుంటున్నారని, పార్టీ ఎదుగుదలకు ఆయన ఎప్పుడు సహకారం అందించడంలేదని, ఇలా ఎన్నో విషయాలను ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు హైలైట్ చేస్తున్నారు.ఇదే విషయమై సోనియా గాంధీకి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం రేవంత్ వ్యవహారంపై పార్టీలో విస్తృతమైన చర్చ జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

తేల్చుతారా తేల్చరా కాంగ్రెస్ లో రాజుకున్న రేవంత్’ మంటలు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

రేవంత్ రెడ్డి పాపాల పుట్ట మిగిలిందని, భూకబ్జాలతో ఆయన రాజకీయ భవిష్యత్తు అంధకారం చేయబోతోందని, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎంత సంతోషంలో ఉన్నారు.

టిడిపిలో ఉన్నప్పుడూ, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలోనూ రేవంత్ వ్యవహార శైలిలో మార్పు లేదని, కాంగ్రెస్ పార్టీ ని పావుగా ఉపయోగించుకుని ఆయన రాజకీయ ఎదుగుదలకు ఉపయోగించుకుంటున్నాడు అంటూ వారు విమర్శిస్తున్నారు.అంతేకాకుండా రేవంత్ పై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకునే వరకు తాము ఊరుకునేది లేదు అన్నట్లుగా కాంగ్రెస్ సీనియర్ నాయకుల వ్యవహార శైలి కనిపిస్తోంది.ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు