రేవంత్ దూకుడు సీనియర్లకు నచ్చడంలేదా ?  

Congress Seniour Leaders Fire On Revanth Reddy Activity-hanumanth Rao,komati Reddy Venkat Reddy,revanth Reddy,uttam Kumar Reddy

తెలంగాణ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు పొందిన టి.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యవహారశైలి ఇప్పుడు ఆ పార్టీలోని సీనియర్ నాయకులకు మింగుడుపడడంలేదు.తాజాగా హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఎన్నిక లో పోటీచేసే అభ్యర్థి విషయంలో రేవంత్ మాట్లాడిన మాటలు పార్టీలో అలజడి సృష్టిస్తున్నాయి.

Congress Seniour Leaders Fire On Revanth Reddy Activity-hanumanth Rao,komati Reddy Venkat Reddy,revanth Reddy,uttam Kumar Reddy-Congress Seniour Leaders Fire On Revanth Reddy Activity-Hanumanth Rao Komati Venkat Revanth Uttam Kumar

పార్టీలో చేరిన అతి తక్కువ సమయంలోనే మంచి లీడర్ గా రేవంత్ గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే ఇదే సమయంలో పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఎవరిని రేవంత్ లెక్కచేయనట్టుగా ప్రవర్తిస్తుండడంతో ఆ సీనియర్లంతా రేవంత్ పై ఆగ్రహంగా ఉన్నారు.

Congress Seniour Leaders Fire On Revanth Reddy Activity-hanumanth Rao,komati Reddy Venkat Reddy,revanth Reddy,uttam Kumar Reddy-Congress Seniour Leaders Fire On Revanth Reddy Activity-Hanumanth Rao Komati Venkat Revanth Uttam Kumar

ఇదే సమయంలో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో టి పి సి సి అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి తన సతీమణి పోటీ చేస్తారని ప్రకటిస్తే దానిపై రేవంత్ అభ్యంతరం చెప్పడంతో పాటు హుజూర్ నగర్ నుంచి కిరణ్ రెడ్డి పోటీ చేస్తారా అంటూ చెప్పి కలకలం సృష్టించారు.దీనిపై పార్టీ క్రమశిక్షణ సంఘం కూడా తీవ్రంగా పరిగణిస్తోంది.

ఇదే విషయమై పార్టీలోని సీనియర్లు రేవంత్ పై విమర్శలు చేస్తున్నారు కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ల సలహా తమకు అవసరం లేదంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.అంతేకాదు కోమటిరెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య విభేదాలను సైతం పక్కన పెట్టి హుజూర్నగర్ టికెట్ విషయంలో ఉత్తమ్ కి మద్దతుగా రేవంత్ వ్యతిరేకంగా మాట్లాడటమే కాకుండా ఉత్తంకుమార్ రెడ్డి భార్య పద్మావతి ని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకుంటామని కోమటిరెడ్డి చెప్పారు.

ఇక మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు హనుమంతరావు కూడా రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగారు.కాంగ్రెస్ కోర్ కమిటీలో చర్చించిన తర్వాతే హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించామని ఆ మీటింగ్ లో రేవంత్ కూడా ఉన్నారని, కానీ ఇప్పుడు ఈ విధంగా రేవంత్ మాట్లాడ్డం కరెక్ట్ కాదు అంటూ వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఇటీవల యురేనియం తవ్వకాలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ సమావేశానికి అన్ని పార్టీలను ఆహ్వానించడం దానికి కాంగ్రెస్ కీలక నాయకులంతా హాజరవ్వడం జరిగింది.అయితే అది కాంగ్రెస్ లో మాత్రం అగ్గి రాజేసిన సంగతి తెలిసిందే.దీనిపై మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ను ఉద్దేశించి రేవంత్ మాట్లాడుతూ పవన్ తో సెల్ఫీ దిగే అవకాశం ఇవ్వలేనందునే సంపత్ ఈ విధంగా మాట్లాడారని చెప్పి సంచలనం సృష్టించారు.పవన్‌తో సెల్ఫీ దిగాల్సిన అవసరం తనకు లేదని, తనతోనే సెల్ఫీలు దిగేవారు చాలా మంది ఉన్నారంటూ సంపత్ కూడా అదే రేంజ్ లో ఫైర్ అయ్యారు.

అసలు మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి నల్లమల అడవుల్లో పనేముందని ప్రశ్నించారు.విద్యుత్ సమస్యపై అసెంబ్లీలో ప్రస్తావించడం లేదంటూ రేవంత్ చేసన వ్యాక్యలు క్రమశిక్షణా సంఘం దృష్టికి వెళ్లాయి.

ఈ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీలో చర్చించామని క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండరెడ్డి చెప్పారు.అసెంబ్లీ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే లు మాట్లాడిన తీరు పార్టీ గ్రాఫ్ పెంచుకుంటే రేవంత్ వచ్చి విద్యుత్ సమస్యపై మాట్లాడలేదఅంటూ పార్టీ గ్రాఫ్ తగ్గించారని అసలు ఆ విషయంలో రేవంత్ జోక్యం అనవసరం అంటూ కోదండరెడ్డి విమర్శించారు.

మొత్తంగా ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే కాంగ్రెస్ సీనియర్లందరికి రేవంత్ టార్గెట్ గా మారిపోయినట్టు కనిపిస్తోంది.