హైదరాబాద్‌ కేంద్ర పాలిత ప్రాంతం కాబోతుంది  

Congress Seniour Leader Chinthamohan Comments On Hyderabad-chinthamohan

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను కేంద్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే అవకాశం ఉందంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మాజీ ఎంపీ చింతామోహన్‌ వ్యాఖ్యలు చేశాడు.ఈ విషయమై తన వద్ద రహస్య సమాచారం ఉందని, మోడీ ప్రభుత్వం అందుకోసం చాలా ప్రణాళికలు చేస్తోందని ఈ సందర్బంగా ఆయన అన్నాడు.హైదరాబాద్‌లో ఉన్న రాజకీయ శక్తిని అణచివేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశాడు...

Congress Seniour Leader Chinthamohan Comments On Hyderabad-chinthamohan-Congress Seniour Leader Chinthamohan Comments On Hyderabad-Chinthamohan

ఇక ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఖచ్చితంగా అమరావతి కాదని, అతి త్వరలోనే ఏపీ కొత్త రాజధానిగా తిరుపతిని ప్రకటించబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.అమరావతికి వరద ముప్పు ఉందని, దానికి తోడు భౌగోళికంగా అది ఏమాత్రం బాగాలేదని కేంద్రంకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు విజ్ఞప్తి చేయడం జరిగింది.అతి త్వరలోనే రాజధాని తిరుపతికి తరలి వెళ్లడం ఖాయం అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశాడు.

అందుకే ఏపీ రాజధానిని మార్చాలని కేంద్ర ఆలోచన చేస్తుందని ఈ సంద్బంగా చింతామోహన్‌ అన్నారు.అయితే ఈయన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు.

Congress Seniour Leader Chinthamohan Comments On Hyderabad-chinthamohan-Congress Seniour Leader Chinthamohan Comments On Hyderabad-Chinthamohan