పాదయాత్ర కోసం రేవంత్ కొత్త ఎత్తులు ?

తాను ఎప్పుడూ సంథింగ్ స్పెషల్ అన్నట్టుగానే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉంటారు.ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి ఇదే రకమైన వ్యవహార శైలితో ముందుకు వెళ్తూ, అతి స్వల్ప కాలంలోనే ఈ స్థాయికి చేరుకున్నారు.

 Revanth Reddy Preparing To Padayathra In Telangana, Congress Leaders, Revanth Re-TeluguStop.com

ప్రస్తుతం తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ తమకు ఎదురు లేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ వస్తుండడంతో పాటు, ప్రతిపక్షాలను బలహీనం చేయడంలో సక్సెస్ అయ్యింది.బలమైన రాజకీయ ప్రత్యర్థులు సైతం కెసిఆర్ దూకుడు తట్టుకోలేక మౌనంగానే ఉండిపోతున్నారు.

కానీ రేవంత్ మాత్రం ఆ విషయంలో తనకు ఎన్నిరకాల ఇబ్బందులు ఎదురైనా, లెక్కచేయకుండా అధికార పార్టీపై పోరాటం చేస్తూనే వస్తున్నారు.

ఈ విషయంలో సొంత పార్టీ నాయకుల నుంచి మద్దతు లభించకపోయినా, పట్టించుకోకుండా, ఒంటరిగానే అధికార పార్టీని ఎదుర్కొంటూ వస్తున్నారు.

కాంగ్రెస్ లో చేరిన అతి స్వల్ప కాలంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి సంపాదించిన రేవంత్, తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ విషయంలో పోటీ ఎక్కువగానే ఉన్నా, అధిష్టానం పెద్దల దగ్గర తన పేరే ఫైనల్ అయ్యే విధంగా చేసుకునేందుకు రేవంత్ గట్టిగా కష్టపడుతున్నారు.

ఈ క్రమంలోనే త్వరలోనే తెలంగాణ అంతటా పాదయాత్ర చేపట్టేందుకు రేవంత్ సిద్ధమవుతున్నారు.

Telugu Congress, Revanth Reddy, Revanthreddy, Vhanumantha Rao-Telugu Political N

ఈ విషయంలో సొంత పార్టీ నేతలు మద్దతు లభించకపోవడం, వ్యతిరేకత వస్తుండడంతో పాదయాత్ర చేపట్టేందుకు తన అనుచరుల ద్వారా సోషల్ మీడియాలో పాదయాత్ర కు సంబంధించిన వివరాలను ప్రకటిస్తూ హడావుడి చేస్తున్నారు.తమ అనుచరులు సోషల్ మీడియా ద్వారా చేసే ఈ ప్రచారం వల్ల వచ్చే ఫీడ్ బ్యాక్ ను బట్టి తన పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని, ఈ విషయంలో సొంత పార్టీ నాయకులు, అధిష్టానం పెద్దలు తీరు ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకునేందుకు ఇప్పుడు రేవంత్ ఈ విధంగా తన అనుచరుల ద్వారా పాదయాత్ర చేపట్టే విషయంపై సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టిస్తున్నారు.

ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్లు వి.హనుమంతరావు, జగ్గారెడ్డి వంటి వారు రేవంత్ పాదయాత్ర వ్యవహారంపై స్పందించి అభ్యంతరాలు వ్యక్తం చేశారు.ఈ విషయం అధిష్టానం పెద్దల దృష్టికి వెళితే అక్కడి నుంచి వచ్చే రియాక్షన్ బట్టి పాదయాత్రకు సంబంధించిన విషయాలను బహిరంగంగా ప్రకటించడమా, లేక వేరే కార్యక్రమం ఏదైనా చేపట్టాలా అనే విషయంపై రేవంత్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా, రేవంత్ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక గ్రూపు, రేవంత్ మరో గ్రూపు అన్నట్టుగా పరిస్థితి తయారైంది.ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube