అందరూ అసంతృప్తులే ! కాంగ్రెస్ ఒడ్డెక్కేది ఎలా ?

అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న గ్రూపు రాజకీయాలు మరే పార్టీలోనూ కనిపించవు.సొంత పార్టీ అధికారంలోకి రావడం కంటే , తమ పంతం నెగ్గడమే ముఖ్యం అనే నాయకుల సంఖ్య ఆ పార్టీలో ఎక్కువగానే కనిపిస్తుంటాయి.

 Congress Senior Leader V Hanumantha Rao Sensational Comments On Revanth Reddy, T-TeluguStop.com

అందుకే తెలంగాణ ఇచ్చినా, ఆ పార్టీకి క్రెడిట్ దక్కకపోగా,  రెండుసార్లు అధికారానికి దూరమయింది.అంతేకాదు తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ప్రభావం మాత్రం కనిపించడం లేదు.

పార్టీని కాస్తోకూస్తో పుంజుకునేలా కొంతమంది యువ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నా, పార్టీలోని సీనియర్లు దానికి అడ్డుకట్ట వేస్తూ,  పార్టీని ముంచినా తేల్చినా తామే అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో,  కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు మరింత దిగజారుతూ వస్తోంది.

ప్రస్తుత  పరిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి వంటి యువ నాయకులకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే , కొంతలో కొంత ఊరట లభిస్తుందని, కాంగ్రెస్ అధిష్టానం ఎప్పటి నుంచో ఆలోచిస్తోంది.

ఆయనతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారి పేర్లు పరిశీలనలోకి తీసుకుంటోంది.అయితే కాంగ్రెస్ సీనియర్లు మాత్రం రేవంత్ విషయంలో సానుకూలంగా లేరు.ఆయనకు తప్ప మరెవరికీ పదవి ఇచ్చినా పర్వాలేదని , ఆయనకు కనుక పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే తాము పార్టీని వీడేందుకు కూడా వెనుకాడమని బెదిరింపులకు దిగుతున్నారు.దాదాపు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు అంతా రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారే.

అంతే కాకుండా ఆయన పై వరుసగా కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు.

Telugu Congress, Jagga, Jana, Komati Venkata, Rahul, Sonia, Telangana, Hanumanth

తాజాగా అధిష్టానం కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తిగా ముద్రపడిన వి.హనుమంతరావు ఇప్పుడు రేవంత్ విషయంలో బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చేందుకు వీలు లేదంటూ ఆయన హడావుడి మొదలు పెట్టారు.

మరో వారం రోజుల్లో కొత్త పిసిసి అధ్యక్షుడుని నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకున్న నేపథ్యంలో,  ఒక్కసారిగా వీహెచ్ రంగంలోకి దిగారు.రేవంత్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లోనూ అధ్యక్ష పదవి వద్దని , రెడ్లకు ఆ పదవి ఇవ్వాలి అనుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ఇవ్వాలి అంటూ విహెచ్ డిమాండ్ చేస్తున్నారు.

రేవంత్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగిస్తే ఎవరిని గాంధీభవన్ కు రానివ్వని, ఇప్పుడే తనను మీడియా సమావేశాలు పెట్టకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఓటుకు నోటు కేసులో ఉన్న రేవంత్ జైలుకు వెళ్తే అప్పుడు పార్టీ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Telugu Congress, Jagga, Jana, Komati Venkata, Rahul, Sonia, Telangana, Hanumanth

 రేవంత్ పై ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తుండటం తో ఆయన అనుచరులు తనకు ఫోన్ చేసి దూషిస్తున్నారు అంటూ విహెచ్ మండిపడుతున్నారు.కాంగ్రెస్ సీనియర్లంతా ఈ విధంగా అసంతృప్తి రాగం వినిపిస్తూ సొంత పార్టీ నాయకులు పైన విమర్శలు చేసుకుంటూ పార్టీని మరింత దెబ్బతీస్తూ వస్తుండడతో కాంగ్రెస్ ఎప్పటికైనా కొలుకుంటుందా అనే అనుమానాలు అందరిలోనూ నెలకొన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube