రాష్ట్రంలో పరిస్థితులు ఎక్కడ బాగున్నాయో చెప్పాలి.. తెలంగాణా సిఎస్ పై వీహెచ్ ఫైర్..!

తెలంగాణా రాష్ట్రంలో కరోనా కేసులు కంట్రోల్ లోనే ఉన్నాయని.రాష్ట్రంలో లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి కనిపించడం లేదని సిఎస్ సోమేష్ కుమార్ చెప్పారు.

 Congress Senior Leader V Hanumantha Rao Fires On Cs Somesh Kumar-TeluguStop.com

ఇతర రాష్ట్రాలను పోల్చుకోవద్దని.అక్కడ పరిస్థితిని బట్టి వారు లాక్ డౌన్ విధించాయని అన్నారు.

అయితే సోమేష్ కుమార్ వ్యాఖ్యలపై స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు.లాక్ డౌన్ అవసరం లేదంటున్న సిఎస్ రాష్ట్రంలో ఎక్కడ పరిస్థితులు బాగున్నాయో చెప్పాలని అన్నారు.

 Congress Senior Leader V Hanumantha Rao Fires On Cs Somesh Kumar-రాష్ట్రంలో పరిస్థితులు ఎక్కడ బాగున్నాయో చెప్పాలి.. తెలంగాణా సిఎస్ పై వీహెచ్ ఫైర్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి.

ఓ పక్క హాస్పిటల్ లో బెడ్లు, ఆక్సిజన్ లు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఇవేవి ప్రభుత్వానికి కనిపించడం లేదా అని అన్నారు.

సిఎస్ సోమేష్ కుమార్ వాస్తవాలని చెప్పాలని చెప్పారు వీహెచ్.పనిలో పనిగా రాజకీయపరంగా కూడా కామెంట్ చేశారు వీహెచ్.

బీజేపీ, టీ.ఆర్.ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని అన్నారు.ఇక బెంగాళ్ సిఎం మమతా బెనర్జీపై తెలంగాణా బీజేపీ నాయకుడు బండి సంజయ్ వ్యాఖ్యలను వీహెచ్ ఖండించారు.

దీదీకి బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు వీహెచ్.బెంగాల్ లో జరుగుతున్న అల్లర్లకు మమతా బెనర్జీనే కారణమని బండి సంజయ్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే.

 దీదీపై బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై వీహెచ్ ఆయన్ను విమర్శించారు.

#Vh Corona #Congress #Corona Cases #SeniorLeader #Cs Somesh Kumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు