ఎగ్జిట్ పోల్స్ వెనుక 5 లక్షల కోట్ల కుంభకోణం అంటా! తులసిరెడ్డి విశ్లేషణ ఇది  

ఎగ్జిట్ పోల్స్ బిగ్ స్కాం అంటున్న తులసీరెడ్డి.

Congress Senior Leader Says Exit Polls Is A Big Scam-congress,congress Senior Leader,exit Polls Is A Big Scam,lok Sabha Elections,tdp

ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపొయింది. ఆ పార్టీకి ఓటు బ్యాంకు కనీసం ఒక్క శాతం కూడా వచ్చిందో, లేదో డౌట్ గానే ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీని ఏపీలో నడిపించే నాయకుడు కూడా ప్రస్తుతం కనుచూపు మేరలో కనిపించడం లేదు..

ఎగ్జిట్ పోల్స్ వెనుక 5 లక్షల కోట్ల కుంభకోణం అంటా! తులసిరెడ్డి విశ్లేషణ ఇది-Congress Senior Leader Says Exit Polls Is A Big Scam

కాని ఆ పార్టీనే ఇంకా నమ్ముకొని కొంత మంది నాయకులు ఉన్నారు. అప్పుడప్పుడు వారు మీడియా ముందుకొచ్చి సంచలన వాఖ్యలు చేసి ఓ రెండు రోజులు మీడియాలో కనిపిస్తారు. ఇప్పుడు కూడా అలాగే ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత తులసీ రెడ్డి ఎగ్జిట్ పోల్స్ గురించి సంచలన వాఖ్యలు చేసి మీడియా ముందుకొచ్చారు.

మీడియా సంస్థలు చాలా ఆర్బాటంగా ప్రకటించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఎన్నికల్లో బీజేపీకి ఆర్థిక సాయం చేసిన కార్పోరేట్‌ సంస్థల షేర్లు పెంచేందుకేనని అని అన్నారు. వీటి వెనుక 5.33 లక్షల కోట్ల కుంభకోణమని సంచలన ఆరోపణ చేసారు. ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమైన పోల్స్‌ కాదనే విషయం అందరికి తెలుసని ఈసారి ఎగ్జిట్‌ పోల్స్‌ కచ్చితంగా మానిప్యులేటెడ్‌ ఎగ్జిట్‌ పోల్సేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇక దేశంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, దీనిని ఎవరు ఆపలేరని తులసీరెడ్డి చెప్పుకొచ్చారు.