ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని బబ్బెర చిలుక గ్రామంలో ప్రభుత్వ నోటిఫికేషన్ ఇవ్వడం లేదని మనస్తాపం తో ఆత్మహత్య చేసుకున్న మహేష్ కుటుంబాన్ని పరామర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు. తన వంతు సహాయంగా యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందచేసి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

 Congress Senior Leader Hanumantha Rao Visits Unemployee Mahesh Family Details, C-TeluguStop.com

తెలంగాణ ప్రభుత్వం వెంటనే మహేష్ కుటుంబానికి దళితబంధు వర్తింపు చేసి ఆదుకోవాలని ఆయన పేర్కొన్నారు.తెలంగాణలో కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికి ఉద్యోగాలు ఇచ్చారు కానీ నిరుద్యోగ యువతకు మాత్రం నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ వేసి నిరుద్యోగుల ప్రాణాలు కోల్పోకుండా చూడాలని ఆయన తెలిపారు.

ఆయన వెంట స్థానిక కాంగ్రెస్ శ్రేణులు వున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube