నాగార్జున సాగర్ ప్రచారంలో రేవంత్ చేరిక కాంగ్రెస్ కు లాభించేనా?

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది.ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికలలో కాంగ్రెస్ చతికిల పడడంతో కాంగ్రెస్ కంచుకోటగా భావించే నాగార్జున సాగర్ ఉపఎన్నిక కాంగ్రెస్ కు ఇప్పుడు చావోరేవో అన్న చందంగా మారింది.

 Congress Revanth Reddy Nagarjuna Sagar Elections Campaign-TeluguStop.com

అయితే రాష్ట్రమంతా కాంగ్రెస్ బలహీనంగా మారిన పరిస్థితులలో కాంగ్రెస్ కు ఊతమివ్వడానికి కాంగ్రెస్ లో పెద్దగా ప్రజాదరణ కలిగిన నేతలు లేరు.ఎంతో కొంత రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న రేవంత్ రెడ్డికి ప్రజలలో కొంత ఆదరణ ఉంది.

ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రచారంలో పెద్దగా కదలిక లేకపోయినా రేవంత్ చేరికతో కాంగ్రెస్ కార్యకర్తలలో ఊపు వచ్చిందనే చెప్పవచ్చు.ఇక రేవంత్ తన ప్రచారంలో ఒక మాట పదేపదే ఒక మాట గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

 Congress Revanth Reddy Nagarjuna Sagar Elections Campaign-నాగార్జున సాగర్ ప్రచారంలో రేవంత్ చేరిక కాంగ్రెస్ కు లాభించేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నేను జానరెడ్డికి పెద్ద కొడుకును అని జానారెడ్డికి భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థానంలో ఉంటాడని ప్రజలకు భరోసా కల్పిస్తూ ప్రచారంలో ముందుకు కదులుతున్నాడు.మరి రేవంత్ మాటల తూటాలు ప్రజల్లో ఆలోచన కలిగించి కాంగ్రెస్ వైపు ప్రజలు చూసేలా చేస్తాయని కాంగ్రెస్ నేతలు భారీగా ఆశలు పెట్టుకున్నారు.

మరి రేవంత్ ప్రచారం కాంగ్రెస్ కు ఎంతవరకు లాభిస్తుందనేది చూడాల్సి ఉంది.

#Nagarjunasagar #NagarjunaSagar #Congress #Revanth Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు