ఏపీలో మళ్లీ పుంజుకుంటున్న కాంగ్రెస్..!!

విభజన దెబ్బకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మట్టానికి కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే.ఒకానొక సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తన స్వార్ధ రాజకీయ లబ్దికోసం 2014 ఎన్నికల సమయంలో యూపీఏ హయాంలో రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించడం తో ఆంధ్రాలో అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ మనుగడ అదం పాతాళంలోకి వెళ్లిపోవడం జరిగింది.

 Congress Resurfaces In Andhra Pradesh, Congress,andhra Pradesh,mailavaram,ibrahi-TeluguStop.com

విభజన జరిగిన తర్వాత వచ్చిన ఎలాంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకోలేదు.

అంత మాత్రమే కాక ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది.

అటువంటి పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ మళ్లీ ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో పుంజుకోవడంతో ఆ పార్టీ శ్రేణులలో ఉత్సాహం నెలకొంది.పూర్తి విషయంలోకి వెళ్తే తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తొలి విజయం సాధించింది.

మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు గ్రామ సర్పంచ్  ముక్కోణపు పోటీలో కాంగ్రెస్ (ఐ) అభ్యర్థి  గొంది సురేష్ విజయం సాధించారు.దీంతో స్థానిక కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

బాణా సంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు.కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని సురేష్ చెప్పారు. 

Telugu Andhra Pradesh, Congress, Dividedandhra, Gondi Suresh, Ibrahim Patnam, Ma .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube