టి.కాంగ్రెస్ తరువాయి టికెట్ల పంపకం రేపేనట !  

Congress Remaining Seats Will Announce Tomorrow-

కాంగ్రెస్‌ అభ్యర్థుల తుది జాబితా పూర్తిస్థాయిలో ఖరారైందని, మిగిలిన 19 స్థానాల్లో అభ్యర్థులను రేపు ప్రకటిస్తామని ఏఐసీసీ కార్యదర్శి బోస్‌రాజ్‌ తెలిపారు. ఢిల్లీలో బోస్‌ రాజు విలేకరులతో మాట్లాడుతూ… కోదండరామ్‌తో చర్చలు ఫలించాయని చెప్పిన బోస్‌రాజ్‌, ఎటూ తేలకుండా ఉన్న నాలుగు స్థానాల్లో ఆశావహులతో రాహుల్‌ చర్చిస్తున్నారని తెలిపారు. .

టి.కాంగ్రెస్ తరువాయి టికెట్ల పంపకం రేపేనట ! -Congress Remaining Seats Will Announce Tomorrow

బీసీలకు టీఆర్ఎస్‌ కంటే కాంగ్రెస్‌ పార్టీనే ఎక్కువ సీట్లు కేటాయించిందన్నారు. సీట్లు దక్కని వారికి పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని ఏఐసీసీ కార్యదర్శి బోస్‌రాజ్‌ స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక టీఆర్‌ఎస్‌ను ఓడించడమే మహా కూటమి లక్ష్యమని స్పష్టం చేశారు.