ప్రియాంకా గాంధీ పరువు తీసిన నేత  

Congress Rally Raised Slogan On Priyanka Chopra - Telugu Congress, National News, Priyanka Chopra, Priyanka Gandhi, Rally, Surendra Kumar

ఒక్కోసారి రాజకీయ నేతలు చేసే వ్యాఖ్యలు నవ్వులు పూయిస్తాయి.మరికొన్నిసార్లు వారు అనే మాటలు వారి పార్టీ పరువును మంటగలుపుతాయి.

Congress Rally Raised Slogan On Priyanka Chopra

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బాలయ్య చేసిన బుల్ బుల్ కామెంట్ అందరికీ తెలిసిందే.అది ఎంతగా వైరల్ అయ్యిందంటే అప్పట్నుంచి బాలయ్యను విమర్శించే వారు బుల్ బుల్ బాలయ్య అంటూ పిలుస్తున్నారు.

ఇప్పుడు ఇలాంటిదే జాతీయ కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంది.

ఢిల్లీలోని కాంగ్రెస్ నేత సురేంద్ర కుమార్ నిర్వహించిన ర్యాలీకి ఆ పార్టీ సీనియర్ నేత సుభాష్ చోప్రా హాజరయ్యారు.

ఆ సమయంలో సురేంద్ర కుమార్ ప్రసంగించి చివరకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీలకు జిందాబాద్ కొట్టారు.ఇదే క్రమంలో ప్రియాంకా గాంధీ అనబోయి ప్రియాంకా చోప్రా అని అభాసుపాలయ్యారు.

దీంతో అక్కడున్నవారు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

వెంటనే అక్కడున్న నేతలు తేరుకుని క్షమాపణలు కోరారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.ఇప్పటికే కాంగ్రెస్ పరువు అంతంతమాత్రంగా ఉందంటే, ఇలాంటి నాయకులు ఉన్న పరువు కాస్త తీసేస్తున్నారంటూ పలువురు మండిపడుతున్నారు.