రజినీకాంత్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి రాజకీయ రంగు

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటుడు రజినీకాంత్.సుదీర్ఘ నట ప్రస్తానంలో ఇండియన్ బాషలతో పాటు హాలీవుడ్ లో కూడా హీరోగా నటించిన ఘనత రజినీకాంత్ సొంతం.75 ఏళ్ళు దాటిన ఇప్పటికి అదే ఎనర్జీతో తెరపై తన నటనతో ప్రేక్షకులకి కావాల్సిన వినోదాన్ని అందించడానికి రజినీకాంత్ ప్రయత్నం చేస్తూ ఉంటాడు.ఇప్పటికిప్పుడు రజినీకాంత్ సినిమాలు వదిలేసిన ఆయన ఇమేజ్ అలాగే ఉంటుంది.

 Congress Questions Timing Of Dadasaheb Phalke Award To Rajinikanth, Kollywood, T-TeluguStop.com

రజినీకాంత్ కమర్షియల్ హీరోగా తన స్టైల్, మేనరిజమ్స్ తో విశేషంగా అభిమానులని సొంతం చేసుకున్న అతని సహచర నటుడు కమల్ హసన్ తో రజినీకాంత్ నటనని పోల్చి చూపిస్తూ విమర్శలు చేసే వారు కూడా ఉన్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ఈ ఏడాదికి గాను రజినీకాంత్ కి ప్రకటించింది.

రజినీకాంత్ కి దాదాసాహెబ్ అవార్డు ఇవ్వడం వందశాతం సమ్మతమే అయినా కూడా ఇప్పుడు దీనిని రాజకీయ కోణంలో చూస్తూ రాజకీయ నాయకులు విమర్శలు చేస్తున్నారు.

దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండటమే.

తమిళ అసెంబ్లీ ఎన్నికలలో డిసెంబర్ వరకు రజినీకాంత్ కూడా పార్టిసిపేట్ చేస్తానని చెప్పి ఆరోగ్య కారణాలు చూపిస్తూ సడెన్ గా వెనక్కి తగ్గారు.అయితే రజినీకాంత్ మొదటి నుంచి బీజేపీకి అనుకూలంగా ఉండే వ్యక్తి అనే ప్రచారం ఉంది.

ఈ నేపధ్యంలో ఎన్నికలలో రజినీకాంత్ ఫ్యాన్స్ ఓటు బ్యాంకుని సొంతం చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఉన్నపళంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అతనికి ప్రకటించింది అనేది అక్కడ ప్రధాన పార్టీ అయిన డీఏంకె నేతలు విమర్శలు చేస్తున్నారు.కమల్ హసన్ కూడా తమిళ్ ఎన్నికలలో పోటీ చేస్తున్న ఆయన రజినికి దాదాసాహెబ్ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశాడు.

అయితే కాంగ్రెస్, డీఏంకె పార్టీల నేతలు మాత్రం విమర్శలు చేస్తున్నారు.దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని బీజేపీ తన రాజకీయ ప్రయోజనాలు వాడుకోవడానికి ఉపయోగించుకుంటుంది అంటూ విమర్శలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube