కాంగ్రెస్ వల్లనే ప్రధానిగా మోడీ

నిజమే ….కాంగ్రెస్ వల్లనే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు.

 Bjp Government Imposing Its Ideology-TeluguStop.com

పదేళ్ళ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన జనం భాజపా నాయకత్వంలోని ఎన్డీయే కూటమిని బంపర్ మెజారిటీతో గెలిపించారు.దీంతో మోడీ ప్రధాని అయ్యారు.

ఇది మనకు తెలిసిన విషయం.కానీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా కాంగ్రెస్ వల్లనే మోడీ ప్రధాని అయ్యారని అన్నారు.

బీహార్లోని బక్సర్లో ఎన్నికల ప్రచారంలో ఆమె ఈ మాట చెప్పారు.కానీ ఆమె మాటలకు అర్థం వేరు.

తమ తప్పుల కారణంగా, కుంభకోణాల వల్ల మోడీ ప్రధాని అయ్యారని చెప్పలేదు.కాంగ్రెస్ పాలనలో (నెహ్రూ కాలం నుంచి) దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రస్ బలోపేతం చేసిందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని, అందుకే మోడీ ప్రధాని కాగలిగారని సోనియా అన్నారు.

భాజపా ప్రజాస్వామ్య విలువల నుంచి పక్కకు పోతున్నదని విమర్శించారు.భాజపా భావజాలం వాళ్ళ ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని, మత పరమైన ఉద్రిక్తత పెరుగుతోందని అన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోడీ పూర్తిగా విఫలం అయ్యారని విమర్శించారు.కాంగ్రెస్ పాలనలో దేశంలో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ఈ సంగతి అందరూ తెలుసుకోవాలని, ప్రధానంగా యూత్ తెలుసుకోవాలని చెప్పారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube