సుష్మా నటనలో దిట్ట

విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సినిమాల్లో నటిస్తున్నారా? లేక డ్రామాల్లో నటిస్తున్నారా? మనకు తెలిసినంతవరకూ ఆమె నటి కాదు.కాని సుష్మా బాగా నటిస్తున్నారని కాంగ్రెస్స్ అధినేత్రి సోనియా గాంధి వ్యంగ్యంగా అన్నారు.

 Sushma Expert At Theatrics-TeluguStop.com

అవినీతి ఆరోపణలు రావడంతో విదేశాలకు పారిపోయిన లలిత్ మోడీ విషయంలో వీరి ఇద్దరి మధ్య పోరాటం జరుగుతున్న సంగతి తెలుసు.లలిత్ మోడీకి సహాయం చేసిన సుష్మా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న సోనియా పార్లమెంటు సమావేశాలను జరగనివ్వడంలేదు.

మోడీతో తనకు సంబంధం లేదని, తను ఆయనకు సాయం చేయలేదని చెప్పారు.మోడీ లండన్ నుంచి పోర్చుగల్ వెళ్లేందుకు తాను బ్రిటన్ ప్రభుత్వానికి సిఫార్సు చేయలేదన్నారు.

క్యాన్సర్తో బాధపడుతున్న మోడీ భార్య పట్ల మానవత్వంతో వ్యవహరించానని పార్లమెంటులో వివరణ ఇచ్చారు.దీన్నే నటన అంటారని సోనియా విమర్శించారు.

తల్లితో పాటు కుమారుడు రాహుల్ కూడా బాణాలు వేసారు.జైలుకు వెళ్ళకుండా తప్పించుకోవడానికి మోడీ సుష్మా కుటుంబానికి ఎంత డబ్బు ఇచ్చారని ప్రశ్నించారు.

మొత్తమ్మీద తల్లి, కొడుకు భాజపా సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube