సచిన్ పైలట్ vs గెహ్లాట్‌: రాజస్థాన్‌లో కాంగ్రెస్ నేతల మధ్య మళ్ళీ మెుదలైన పోరు

రాజస్థాన్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.సీఎం పదవికి బలమైన పోటీదారు సచిన్ పైలట్, గెహ్లాట్ శిబిరం ఎమ్మెల్యేల మధ్య మళ్ళీ తీవ్రమైన మనస్పర్థాలు చోటుచేసుకున్నాయి.

 Congress President Election Cm Ashok Gehlot Can File Nomination On September 28-TeluguStop.com

ఒక్కవేళ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికైతే రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరూ అనే దానిపై కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి.గెహ్లాట్ క్యాంపు ఎమ్మెల్యేలు పైలట్‌తో బహిరంగంగా కలవకలేకపోతున్నారు.

శుక్రవారం పైలట్ అసెంబ్లీకి చేరుకోగానే గెహ్లాట్ క్యాంపు ఎమ్మెల్యేలు అభివాదం చేయడంలో కాస్త సంశయించారు.గెహ్లాట్ శిబిరం ఎమ్మెల్యే సీఎం సూచనల కోసం ఎదురు చూస్తున్నట్లు స్పష్టమవుతోంది.

సీఎం అశోక్ గెహ్లాట్ జైపూర్‌కు తిరిగి రాగానే తదుపరి వ్యూహంపై తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు.

Telugu Ashok Gehlot, Pilot-Politics

కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి సీఎం గెహ్లాట్ సెప్టెంబర్ 28న నామినేషన్ దాఖలు చేయనున్నారు.గెహ్లాట్‌కు మద్దతిచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు సెప్టెంబర్ 27న ఢిల్లీకి వెళ్లవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇదే జరిగితే గెహ్లాట్ సత్తా చాటినట్లవుతుంది.

రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి పదవిపై ఎవరు కూర్చోవాలనే దానిపై గెహ్లాట్ అభిప్రాయం కీలకం కానుంది.గెహ్లాట్ స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మారబోతున్నప్పుడు, గాంధీ కుటుంబం నిర్ణయంలో అతని అభిప్రాయాన్ని ముఖ్యమైనదిగా పరిగణిస్తుంది.

ఇక మరోవైపు గెహ్లాట్ సీఎం పదవిని అంత తేలిగ్గా వదులుకునే వారు కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.ఒక్కవేళ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే పైలట్ సీఎం అవుతాడన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది.

అయితే గెహ్లాట్.పైలట్ అంత తేలిగ్గా ఛాన్స్ ఇవ్వడని.

అద్భుతమైన ఎత్తుగడలతో ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తుడనే అభిప్రాయం ఉంది.మరి ఈసారి ఇలాంటివి చేయగలరా లేదా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube