సచిన్ పై సీరియస్ యాక్షన్ తీసుకున్న అధిష్టానం,వేటు

అనుకున్నట్లుగానే రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ పై అధిష్టానం సీరియస్ యాక్షన్ తీసుకుంది.మరోసారి ఈ రోజు జరిగిన సీఎల్ఫీ సమావేశానికి కూడా సచిన్ డుమ్మా కొట్టడం తో అధిష్టానం ఇక చర్యలకు ఉపక్రమించింది.

 Congress Party Took Action Against Sachin Pilot-TeluguStop.com

పైలట్ నిర్వహిస్తున్న రెండు పదవుల నుంచి కూడా ఆయనకు ఉద్వాసన పలికింది.పైలట్ తో పాటు మరో ఇద్దరు మంత్రులపై కూడా అధిష్టానం వేటు వేసినట్లు తెలుస్తుంది.

అయితే వేటు పడిన ఆ ఇద్దరు మంత్రులు కూడా పైలట్ వర్గానికే చెందినవారేనన్నట్లు తెలుస్తుంది.

అధిష్టానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ సొంత పార్టీ పై తిరుగుబాటు కు దిగడం తో అటు అధిష్ఠానం నుంచి ప్రియాంక గాంధీ,రాహుల్ గాంధీ లు మంతనాలు జరిపారు.

అయినప్పటికీ సచిన్ మెత్తబడకపోవడం తో చివరికి అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.దీనితో పైలట్ పై వేటు వేయక తప్పలేదు.దీనితో రాజస్థాన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు అయ్యింది.మరోపక్క పైలట్ వేటు పై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ స్పందించారు.

అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంది అని,గత ఆరు నెలల నుంచి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చాలని పైలట్ కుట్ర చేస్తున్నారని చివరికి వేటు కు గురవ్వక తప్పలేదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

అధిష్టానం తీసుకున్న నిర్ణయం తో సచిన్ ను డిప్యూటీ సీఎం పదవి నుంచి అలానే పీసీసీ చీఫ్ పదవి నుంచి కూడా వేటు వేసినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించిన సచిన్ పైలట్ కు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడా ఉన్నట్లు ప్రకటించారు.పార్టీ అధిష్టానం ఎంతగా బుజ్జగించినా పైలట్ వినకపోవడం తో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube