కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అటు దేశంలో ఇటు రాష్ట్రంలో చాలా దారుణంగా తయారైంది.నాయకత్వంపై సొంత పార్టీ నేతల నుంచి అసంతృప్తి, వ్యతిరేకత వస్తుండటం ఆ పార్టీ నేతలకు తలనొప్పిగా మారుతోంది.
పీసీసీ నియామకం విషయంలో అధిష్టానం తీసుకునే నిర్ణయాలను గౌరవించకుండా వారికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తున్నారు ఆ పార్టీ నేతలు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయానికి బాధ్యతవహిస్తూ పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయడంతో అధిష్టానం కొత్త పీసీసీ అధ్యక్షుని వేటలో పడింది.
అయితే ఈ బాధ్యతను ఏఐసీసీ రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్‌కు కాంగ్రెస్ అధిష్టానం అప్పగించింది.ఇదే విషయంపై పార్టీ సీనియర్ నేతలతో సమావేశమై అందరి అభిప్రాయాలను తీసుకుని ఆ సమాచారాన్నంతా రాహుల్ గాంధీకి ఆయన నివేధించారు.
మాణిక్కం ఠాగూర్ ఇచ్చిన నివేదిక ప్రకారం పీసీసీ నియామకం చేపట్టాలనుకున్న క్షణంలో అధిష్టానానికి సొంత పార్టీ సీనియర్ నేతల నుంచి చుక్కెదురైంది.ఇతరులెవరికి పీసీసీ చీఫ్‌గా ఛాన్స్ ఇవ్వొద్దని.
ఆ అవకాశాన్ని తమకే ఇవ్వాలని ఎవరికి వారూ ఢిల్లీ బాట పట్టి రాహుల్‌ను, సోనియా గాంధీని ఇప్పటికే పలువురు నేతలు కలిశారు.ఇలా కలిసిన వారిలో కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారు.
అలాగే మరికొంత మంది సోనియా, రాహుల్‌గాంధీల అపాయింట్‌మెంట్‌ల కోసం తెగ ట్రై చేస్తున్నారు.ఇలా పీసీసీ పీఠం కోసం ట్రై చేస్తున్న వారి సంఖ్య కాంగ్రెస్‌లో దాదాపు పది మందికిపైనే ఉంది.

పీసీసీ పీఠం కోసం అందరూ ఢిల్లీ బాట పడుతుండటం ఇప్పుడు అధిష్టానానికి తలనొప్పిగా మారిందట.ఇందుకు పీసీసీ పీఠం కోసం ఢిల్లీకి ఎవరూ రాకూడదనే హుకూంను అధిష్టానం జారీ చేసిందట.తాము పిలిచేంత వరకు ఎవరూ రాకూడదని అందరికీ తేల్చి చెప్పేశారట.పీసీసీ నియామకం, అభ్యర్థి ఎంపిక కొత్త తలనొప్పులు ఎక్కడ తెచ్చిపెడతాయనే ఉద్ధేశ్యంతో పీసీసీ నియామకంపై కొంత సమయం వరకు వేచి చూడాలనే ధోరణీలో అధిష్టానం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
మాణిక్కం ఠాగూర్ కూడా ఢిల్లీ నుంచి తమిళనాడుకు వెళ్లిపోయారు.ఈ నెల 22 వరకు ఆయన ఢిల్లీకి తిరిగి వెళ్లే ఛాన్స్ లేదు.అప్పటి వరకు ఎవరూ కూడా ఢిల్లీకి రాకూడదని ఆయన నేతలతో చెప్పినట్లు సమాచారం.
అలాగే పీసీసీ నియామకం ముందు సీనియర్ల అభిప్రాయాన్ని రాహుల్, సోనియాలు మరొకసారి తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
అప్పటి వరకు పీసీసీ చీఫ్ నియామకంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదనే ఆలోచనలో అష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.