కాంగ్రెస్ తో పొత్తా..? టీడీపీ చిత్తే ! ఆ సర్వేలో తేలింది ఇదే   Congress Party Tie Up Will Be Defeated TDP Party     2018-10-18   09:51:55  IST  Sai M

అధికారం దక్కించుకోవడానికి రాజకీయ పార్టీలు రకరకాల ఎత్తులు వేస్తుంటాయి. రాజకీయంగా బద్ద శత్రువులు అనుకున్న వారిని కూడా అవసరం అయితే కలుపుకుని వెళ్లేందుకు సందేహించారు. ఈని ఎత్తులు వేసినా.. పై ఎత్తులు వేసినా అంతిమంగా కావాల్సింది విజయం. ఇక ఏపీ అధికార పార్టీ టీడీపీ విషయానికి వస్తే… కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆ పార్టీ పునాదులను పెకిలించాలనే ఉద్దేశంతో పుట్టిన పార్టీ టీడీపీ. టీడీపీ పుట్టినదగ్గరనుంచి ఇప్పటివరకు ఆ పార్టీ టీడీపీ కి బద్ద శత్రువే. కానీ ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీతో టీడీపీ పొత్తుకు సిద్ధం అయిపొయింది.

మొన్నటి వరకూ ఏపీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు చాలా ఉత్సాహంగా కనిపించాడు. తెలంగాణలో కాంగ్రెస్ తో ఇప్పటికే చేతులు కలిపేసిన చంద్రబాబు నాయుడు ఏపీలో కూడా కాంగ్రెస్ తో దోస్తీకి రెడీ అయిపోయాడు. అక్కడకూ ఈ విషయంలో కొంతమంది టీడీపీ నేతలే అభ్యంతరం చెప్పారు. కాంగ్రెస్ తో పొత్తు అంటే తాము ఆత్మహత్యలు చేసేసుకుంటామని వాళ్లు హెచ్చరించేశారు. అయితే బాబు మాత్రం అవేవి పట్టించుకోవడంలేదు.

Congress Party Tie Up Will Be Defeated TDP Party-

కాంగ్రెస్ పార్టీ తో పొత్తు పెట్టుకోవడానికి బాబు సిద్ధం అయ్యాడు. తెలంగాణాలో ప్రత్యక్షంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడు చేసిన మహాకూటమిలో టీడీపీ చేరిపోయింది. ఇక ఏపీలో ప్రత్యక్ష పొత్తా లేక చీకటి ఒప్పందమా అనే సందేహంలో ఉండిపోయాడు.
అయితే.. ఈ అంశంపై బాబు చేయించుకున్న సర్వేల్లో మొత్తం వ్యవహారం తేడా కొట్టేసిందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపితే ప్రయోజనం లేకపోగా టీడీపీ దెబ్బపదే అవకాశం ఉందని బాబుకు రిపోర్టులు అందాయట. కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు చేతులు కలిపితే అది అవకాశవాద రాజకీయంగా ప్రజలు భావిస్తారని ఆ సర్వేలో స్పష్టం అయ్యిందట. దీంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయం పై ఆలోచనలో పడ్డాడు బాబు.