కాంగ్రెస్ కీలక నిర్ణయం..నెలపాటు మీడియా కు దూరంగా కాంగ్రెస్ నేతలు  

Congress Party Shocking Decision....one Month Stay Away From Tv Debates-

సార్వత్రిక ఎన్నికల్లో విజయం పై మంచి ధీమా తో ఉన్న కాంగ్రెస్ పార్టీ కి కోలుకోలేని దెబ్బ పడిన సంగతి తెలిసిందే.అనూహ్యంగా 300 లకు పైగా సీట్లతో బీజేపీ పార్టీ విజయం సాధించడం తో కాంగ్రెస్ ఘోర పరాజయాన్నీ చవిచూడడమే కాకుండా కనీసం ప్రతిపక్ష హోదా ను సైతం దక్కించుకోలేని పరిస్థితి ఏర్పడింది.

Congress Party Shocking Decision....one Month Stay Away From Tv Debates- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage-Congress Party Shocking Decision....One Month Stay Away From TV Debates-

దీనితో ఈ ఘోర ఓటమికి భాద్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని రాహుల్ గాంధీ పట్టుబడుతున్నారు.ఎంతమంది చినబాబు ని బుజ్జగించిన ససేమిరా అంటున్నారట.అయితే దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాకుండానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

గత కొద్దీ రోజులుగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరూ కూడా మీడియా లో నిర్వహించే చర్చా గోష్ఠులకు వెళ్ళకూడదు అంటూ పిలుపునిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు ఆ పార్టీ అధికార ప్రతినిధులు,పార్టీ నాయకులు ఎవరూ కూడా నెలరోజుల పాటు టీవీ వార్తా ఛానళ్లు నిర్వహిస్తున్న చర్చలకు వెళ్ళవద్దు అంటూ కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్ విభాగం ఇంచార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా ట్వీట్ చేస్తూ తెలిపారు.అంతేకాకుండా దీనికి మీడియా చానళ్ళు కూడా సహకరించాలి అని ఆయన కోరారు.

దీనితో ఒకపక్క రాహుల్ అధ్యక్షుడి గా కొనసాగుతాడా లేదా అన్న టెన్షన్ లో ఉన్న కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు ఇలాంటి నిర్ణయం వెలువడడం తో ప్రాధాన్యం సంతరించుకుంది.

.

తాజా వార్తలు