కాంగ్రెస్ ఈ దుస్థితిలో ఉండడానికి కారణం ఆయనేనా ?

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా తయారయ్యింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.చెప్పుకోవడానికి జాతీయ పార్టీ అయినా మళ్ళీ రెండోసారి కూడా బీజేపీకి అధికారం అప్పగించేలా చేయడంలో కాంగ్రెస్ సొంత తప్పిదం కూడా ఉంది.

కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న అమేథి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ఘంది ఓటమి చెందడం కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుంది అనడానికి నిదర్శనం.ఇక జాతీయ స్థాయిలో ఇలా ఉంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి కూడా మరింత ఘోరంగా తయారయ్యింది.

ఆ పార్టీని పటిష్టం చేయడం పక్కనపెడితే ఉన్న నాయకులను కూడా కాపాడుకోలేని పరిస్థితి దాపరించింది.తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 19 మంది గెలిస్తే ఇప్పటికే 12మంది అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరిపోయారు.

-Telugu Political News

ఇక మిగిలిన వారు తాము కడవరకు కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు అంటూ చెప్పేసారు.వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి పరిస్థితి రావడానికి అసలు కారణం ఏంటా అని ఆరా తీస్తే ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీనే దీనంతటికి కారణంగా తెలుస్తోంది.క్షేత్రస్థాయిలో ఓటమి నుంచి తేరుకోవడానికి కాంగ్రెస్ ను నడిపించడానికి సమర్థుడైన నాయకుడే కరువయ్యాడు.ఆ ఎఫెక్ట్ కారణంగా కాంగ్రెస్ పార్టీపై దేశవ్యాప్తంగా ఆ ప్రభావం పడింది.

ముందు ముందు మరింత పడబోతోంది.ఇక మిగతా రాష్ట్రాల విషయానికి వస్తే ఇప్పటికే గోవాలో మెజార్టీ సీట్లు సాధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో విలీనం అయ్యారు.

తెలంగాణలో విలీనం బాట పట్టారు.కన్నడలోనూ రాజీనామాలు చేస్తున్నారు.

కర్ణాటకలో సంక్షోభ సమయంలో పార్టీని ముందుండి నడిపించడానికి సమర్థుడైన ఒక్క నేత కూడా తాను ఉన్నానని ముందుకు రాలేదు.

-Telugu Political News

ఏపీ లోనూ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే మారింది.సంక్షోభ సమయంలో పార్టీని ముందుకు నడిపించాల్సిన రాష్ట్ర అధ్యక్షుడు రఘవీరా రెడ్డి ఆ పదవికి రాజీనామా చేశారు.తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఉంది.

ప్రస్తుతానికి మల్లు భట్టివిక్రమార్క, శ్రీధర్ బాబు, సీతక్క మాత్రమే కాస్త చురుగ్గా ఉన్నట్టు కనిపిస్తున్నారు.సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా కాంగ్రెస్ వీడే ఆలోచనలో ఉన్నారు.

అయితే ఆయనకు సరైన ప్రత్యామ్న్యాయం కనిపించకపోవడంతో వేచి చుస్తునారు.ప్రస్తుతం కాంగ్రెస్ లో నెలకొన్న ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి అధిష్టానం ఎవర్నీ నియమించలేదు.

ప్రస్తుతం పార్టీలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడడానికి కారణం మాత్రం రాహుల్ గాంధీనే అని, ఆయన పార్టీ గురించి పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube