ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ పార్టీ 150 ఏళ్ల ముసలినక్క అన్న మంత్రి కేటీఆర్ ఆ పార్టీలో ఏ నాయకుని మాటలకు విలువ లేదని తెలిపారు.నేతల మాటల మధ్య పొంతన ఉండదన్నారు.
హైదరాబాద్ లో కమాండ్, బెంగళూరులో న్యూ కమాండ్, ఢిల్లీలో హైకమాండ్ ఇది కాంగ్రెస్ పరిస్థితి అంటూ ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ ను నమ్మితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లేనని పేర్కొన్నారు.
కానీ 65 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధి తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందని చెప్పారు.ఆరు దశాబ్దాలుగా సాగు, తాగునీటితో పాటు కరెంట్ కూడా ఇవ్వని కాంగ్రెస్ ఇప్పుడొచ్చి ఆరు గ్యారంటీలు ఇస్తే నమ్ముతారా అని ప్రశ్నించారు.