కాంగ్రెస్ వెన్నుపోటు..కూటమికి గుండె పోటు..!!!   Congress Party Gives Hands To The Mahakutami Tie Up Parties     2018-11-13   13:13:45  IST  Surya

తెలంగాణలో కేసీఆర్ ని గద్దె దించడమే ధ్యేయంగా, కాంగ్రెస్ పార్టీ మహా కూటమిని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే తనతో పాటు కూటమిలో తెలుగుదేశం, సిపిఐ ,కోదండరాం పార్టీ లతో జట్టుకట్టి కెసిఆర్ ని ఎవరైనా సరే ఓడించాలని సిద్ధమయింది. మిగిలిన పార్టీలు సైతం కెసిఆర్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని అందుకు తగ్గట్టుగా కూటమి పార్టీలు నిస్వార్ధంగా ఉంటాయని తెలిపింది. అయితే ఎప్పుడైతే ఎన్నికలు దగ్గర పడి సీట్ల పంపకాల్లో లుకలుకలు మొదలయ్యాయో ముందు ముందు సినిమా ఎలా ఉండబోతోందో కాంగ్రెస్ కి అర్థమయ్యింది.

అయితే ఈ పరిస్థితుల్లో కూటమిలోని పార్టీలని ఎదిరించే కంటేకూడా తన పని తాను సైలెంట్ గా చేసుకుని పోవడం మంచిదని డిసైడ్ అయిన కాంగ్రెస్ అందుకు తగ్గట్టుగా వెన్ను పోటు రాజకీయాలకి తెరలేపింది. సీట్ల సర్దుబాటు విషయంలో మిత్ర ధర్మాన్ని పాటించకుండా కాంగ్రెస్ పార్టీ రాత్రికి రాత్రి 65 స్థానాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించి సంచలనం సృష్టించింది.. గడచిన కొన్ని రోజులనుంచి కూటమిలో ఉన్న సిపిఐ టీజే ఎస్ పార్టీలకు తాము కోరిన స్థానాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆ రెండు పార్టీలకు మొండిచేయి చూపింది../br>

కోదండరాం ,సిపిఐ కోరిన స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది ఇరు పార్టీలకి దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చింది.. రామగుండం, స్టేషన్ ఘనపూర్, ఆసిఫాబాద్ స్థానాలను సిపిఐ కావాలని ముందు నుంచి పట్టుబట్టింది. అయితే ఈ స్థానాలలో కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించడంతో సిపిఐ గుర్రుగా ఉంది..తాము కోరినవి ఇవ్వకుండా ఆస్థానాలలో మాకు చెప్పకుండా మీ అభ్యర్ధులని ప్రకటించడం ఎంతవరకూ సమంజసం అంటూ ఫైర్ అవుతోంది./br>

Congress Party Gives Hands To The Mahakutami Tie Up Parties-

అయితే ఉత్తంకుమార్ రెడ్డి కుటుంబానికి మాత్రం రెండు టికెట్లు కాంగ్రెస్ పార్టీ అప్పగించింది. దాదాపు నెల పాటుగా కూటమిని నడిపించి చివరకు సీట్ల వద్దకు వచ్చేసరికి మిత్ర ధర్మాన్ని పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడవడంతో ఇరు పార్టీలు భవిష్యత్తు ప్రణాళికలను రచిస్తున్నాయి..చద్రబాబు కి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ఘలక్ లు ఇవ్వకపోవడం గమనార్హం..అయితే కూటమి ధర్మాన్ని సైతం పాటించి సీపీఐ త్వరలోనే 3 లేదా 4 నాలుగు సీట్లకి ఒకే చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.