'కోటి సంతకాలు' కొంగ్రెస్ కు కలిసొస్తాయా!!

రాష్ట్ర విభజన పుణ్యమా ఆంటీ…రెండు రాష్ట్రాల్లో భారీగా నష్టపోయిన పార్టీ ఏదైనా ఉంది అని అంటే ఆది కొగ్రెస్ పార్టీనే.పాపం ఇచ్చిన అభిమానం కూడా చూపకుండా తెలంగాణాలో పార్టీకి ప్రతిపక్ష హోదా కట్టబెడితే.

 Congress Party Fails In 1crore Signature Programme-TeluguStop.com

మరో పక్క సీమాంధ్రలో పూర్తిగా ఊపిరి తీసేసారు ప్రజలు.అయితే ఇదంతా గతం.ఇప్పుడు కొంగ్రెస్ పార్టీ మళ్లీ పునర్జీవం కోసం పోరాటం చేస్తుంది… అందులో భాగంగానే.నవ్యాంధ్ర హితం కోసం కోటి సంతకాల సేకరణ ప్రారంభించింది.

అయితే వాళ్ళు చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుండి నామమాత్రపు స్పందన లభిస్తుందన్న విమర్శలువెల్లువెత్తుతున్నాయి.రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ నవ్యాంధ్ర హితం కోసం కోటిసంతకాల సేకరణ కార్యక్రమం ఏవిధంగా చేపడుతుందన్న చర్చ అటు ప్రతిపక్షాలు, ఇటు ప్రజల్లో వ్యక్తవౌతుంది.

కాగా కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పార్టీకి చెందిన ముఖ్యనేతలు, కార్యకర్తలను అధిష్టానం విస్మరించిందన్న విమర్శలు కూడా వెల్లువెత్తాయి.ఇదిఇలాఉండగా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే కొన్ని కులాలు సైతం వేరే పార్టీవైపు మొగ్గుచూపటంతో కూడా పార్టీ ఘోరపరాజయం పాలైందన్న విమర్శ కూడా వినిపిస్తుంది.

మొత్తంమీద కోటిసంతకాలసేకరణ కార్యక్రమంతోనైనా కాంగ్రెస్‌పార్టీ ప్రజల్లోకి వెళ్తుందో లేదో వేచిచూడాల్సిఉంది.ఇప్పటికైనా కాంగ్రెస్‌పార్టీకి చెందిన సంప్రదాయ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు కేంద్ర,రాష్టప్రెద్దలు ప్రయత్నాలు ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని ఆ పార్టీకి చెందిన నేతలు ఒప్పుకుంటున్నారు.

ఏది ఏమైనా చేసుకున్న పాపం ఊరికినే పోతుందా…అంటున్నారు సామాన్య కార్యకర్తలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube