హుజూరాబాద్‌పై కొత్త వ్యూహానికి తెర‌లేపిన కాంగ్రెస్‌.. వ‌ర్కౌట్ అవుతుందా..

తెలంగాణ రాజ‌కీయాల‌ను మ‌లుపు తిప్పే స్థాయిలో ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లు ఉన్నాయ‌నే చెప్పాలి.అందుకే అన్ని పార్టీలు కూడా ఇక్క‌డ దూసుకుపోయేందుకు రెడీ అవుతున్నాయి.

 Congress Opens New Strategy On Huzurabad  Will There Be A Workout  Congress, Huz-TeluguStop.com

మ‌రీ ముఖ్యంగా బీజేపీ ఎప్ప‌టి నుంచో దూసుకుపోతోంది.ఇక టీఆర్ఎస్ కూడా త‌న పార్టీ క్యాండిడేట్‌ను ప్ర‌క‌టించి ప్ర‌చారంతో హోరెత్తిస్తోంది.

ఇక ఈ ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసుందకు అటు చ‌రిత్ర గ‌ల కాంగ్రెస్ కూడా రెడీ అయిపోయింది.ఇక ఇప్పటికే హుజూరాబాద్‌లో కొన్ని సభలు, సమావేశాలు కూడా చేయ‌డంతో పార్టీకి కొంత జోష్ పెరిగింది.

కానీ గెలుస్తామ‌న్న ధీమా లేద‌ని తెలుస్తోంది.దీంతో గెలుపోటములు పక్కనబెట్టి క‌నీసం పార్టీ ప్రభావం, ఉనికిని చాటాల‌ని చూస్తున్నారు రేవంత్‌.ఇందులో భాగంగానే నియోజకవర్గ ఉప ఎన్నిక బాధ్యతలను దామోదర నర్సింహ చూసుకుంటున్నారు.కానీ కాంగ్రెస్ నుంచి అస‌లు బ‌రిలో ఎవరుంటారు? అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.ఒక‌వైపు టీఆర్ఎస్, బీజేపీలు ప‌ట్టుబ‌ట్టి మ‌రీ బీసీ అభ్యర్థులను నిల‌బెడుతుంటే క‌నీసం క్యాండిడేట్ కూడా కాంగ్రెస్ కు క‌రువైపోయారు.అప్ప‌ట్లో పొన్నం ప్రభాకర్ పేరు వినిపించినా అది ఫైనల్ కాలేదు.

Telugu Cm Kcr, Congress, Damodara Simha, Huzurabad, Konda Surekha, Revanth Reddy

ఇంకోవైపు కొండా సురేఖ పేరు బ‌లంగా వినిపిస్తున్నా కూడా ఆమె షరతులతో ఒప్పుకుంటానంటోంది.ఇక రెండు పార్టీలు బీసీ అభ్య‌ర్థ‌ల‌ను నిల‌ప‌డంతో కాంగ్రెస్ కూడా బీసీ క్యాండిడేట్‌ను బ‌రిలో దింపేందుకు యోచిస్తున్నా క‌రెక్టు క్యాండిడేట్ మాత్రం దొర‌క‌ట్లేదు ఆ పార్టీకి.కాబ‌ట్టి తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్‌.అస‌లు పార్టీ త‌ర‌ఫున హుజూరాబాద్ లో ఓఎవ‌రు చేయాల‌నుకున్నా స‌రే గాంధీ భవన్ లో ఓ స్పెష‌ల్ కౌంటర్ ఏర్పాటు చేసి బుధవారం నుంచి ఈ నెల 5వ తారీఖు దాకా అప్లికేష‌న్లు స‌మ‌ర్పించాల‌ని కోరింది.

అయితే ఇదంతా అయ్యే ప‌నేనా అని అంటున్నారు.ఎందుకంటే పెద్ద లీడ‌ర్లు అంతా గ‌ప్ చేప్ మంతనాలు చేస్తారు గానీ ఇలా అప్లికేష‌న్ చేసుకోవ‌డ‌మేంట‌ని అంతా చ‌ర్చించుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube