బిజెపిలో చేరడం పై క్లారిటీ ఇచ్చిన కోమటిరెడ్డి! త్వరలో అధికారికంగా కన్ఫర్మ్

తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీ నామ రూపాలు లేకుండా కొట్టుకుపోయింది.ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా రాకపోయినా ఓ మోస్తారు సీట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం లేకపోవడం, ఆ పార్టీని ముందుండి నడిపించే సరైన లీడర్స్ లేక ఎవరికి వారు గ్రూపులు కట్టి రాజకీయాలు చేయడం మొదలెట్టారు.

 Congress Mp Komatireddy Venkat Reddy Plan To Jump Bjp-TeluguStop.com

దీంతో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన చాలా మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ తో ఆ పార్టీలోకి చేరిపోయారు.దీంతో ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది.

ఇక తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపించలేకపోయింది.కొంతమంది నేతలు తమ సొంత బలంతో అయితే గెలిచారు.

ఇదిలా ఉంటే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం తెలంగాణలో కనుమరుగు అవుతూ ఉండడంతో ఆ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న చాలామంది ది పార్టీని వీడే ప్రయత్నంలో ఉన్నారు.

ఇప్పటికే సబితా ఇంద్రారెడ్డి బిజెపి గూటికి చేరి పోయింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు అందరిని కూడా బిజెపి ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది.అందులో భాగంగా ఇప్పటికే చాలామందికి గాలం వేసింది.

ఇందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు అని ఆ మధ్య టాక్ వినిపించింది.ఈ నేపథ్యంలో తాజాగా ఎంపీగా గెలిచిన కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో టిఆర్ఎస్ ను ఎదుర్కొనే స్థాయిలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లేదని, టీఆర్ఎస్ ని బలంగా ఎదుర్కోవాలంటే బీజేపీతో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు.ఇక పార్టీ మారే విషయంలో త్వరలో తన కార్యకర్తలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటానని కోమటిరెడ్డి చెప్పడం జరిగింది.

ఆయన వ్యాఖ్యలు బట్టి త్వరలో ఈయన కూడా బిజెపి గూటిలో చేరడం ఖాయం అనే మాట ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube