మంత్రి కేటీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కాంగ్రెస్ ఎంపీ.. !

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అధికార పార్టీ వ్యవహారం ప్రతిపక్షాలకు కొరకరాని కొయ్యలా మారిందనే రూమర్స్ విపరీతంగా ట్రోల్ అవుతున్నాయట.దీనికి తోడు రాష్ట్ర ప్రజలను బానిసల కంటే ఘోరంగా చూస్తూ, పేదవారు ఇంకా నిరుపేదలు కావడానికి అధికార పార్టీ నియంత్రత్వ పోకడలు కారణం అవుతున్నాయని విమర్శించే నేతలు కూడా ఉన్నారు.

 Congress Mp Komatireddy Fires On Minister Ktr-TeluguStop.com

ఒకరకంగా బానిస బ్రతుకులు అనుభవిస్తున్న ప్రజల్లో మార్పు రావాలని కోరుకుంటున్నారట.

Telugu Congress Mp, Fires, Komatireddy, Ktr, Trs Minister-Latest News - Telugu

ఇకపోతే తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కేటీఆర్ నేడు పర్యటించారు.అయితే స్థానిక ఎంపీ అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి సమాచారం అందించకపోవడంతో కేటీఆర్ వ్యవహారం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Congress Mp Komatireddy Fires On Minister Ktr-మంత్రి కేటీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కాంగ్రెస్ ఎంపీ.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సంస్కారం అనేది చదువులతో రాదని, ఒకసారి భారత రాజ్యాంగాన్ని చదివితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను గౌరవించడం ఎలాగో తెలుస్తుందని హితవు పలికారు.ఇక రాష్ట్రంలో విపక్షనేతలను ఎదుర్కొనే దమ్ములేక ప్రజల బలహీనతలతో ఆడుకుంటూ పదవులు ఏలుతున్నారని, ఏదో ఒకరోజు మీ అహంకారానికి తగిన గుణపాఠం ప్రజలు చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని విమర్శించారు.

#Trs Minister #Congress MP #Fires #Komatireddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు