తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖాలు చేసిన కాంగ్రెస్ ఎంపీ.. ఎందుకంటే.. ?

కరోనా సమయంలో కోవిడ్ బారినపడిన పేషెంట్స్ బాధలు వర్ణానీతం.ఒకవైపు కరోనా నుండి త్వరగా కోలుకోవాలనే ఆరాటంలో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి అప్పులపాలు అవుతున్నారు.

 Congress Mp Files Pil In Telangana High Court, Congress Mp, Komantireddy Venkat-TeluguStop.com

మరో వైపు ప్రవేట్ ఆస్పత్రుల దోపిడికి అడ్డుకట్ట వేసే వారు లేక విచ్చలవిడిగా అందిన కాడికి దోచుకుంటున్నారు.
n

ఒక్కో పేషెంట్స్ హాస్పిటల్ నుండి డిశ్చార్చ్ అయ్యే వరకు దాదాపుగా 20లక్షల వరకు బిల్లులు వసూల్ చేసిన చరిత్ర కూడా ఉంది.

ఈ విషయంలో కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి తెలంగాణ హైకోర్టు లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

ఈ నేపధ్యంలో ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌ను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ పిల్ వేశారు.

ఇక ఇప్పటికే ఆంద్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు ప్రభుత్వాలు ఈ విధానాన్ని అమలు చేస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు తీసుకోవాల‌ని పేర్కొన్నారు.అంతే కాకుండా రాష్ట్రంలో ఉన్న చాలా ప్రైవేట్ ఆస్ప‌త్రులు జనాలను జలగల్లా పీడిస్తున్న విషయాన్ని పిల్ ద్వారా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి.

ఒకవేళ హైకోర్టు ఈ విషయంలో ప్రజలకు అనుకూలంగా తీర్పునిస్తే కనీసం కరోనాతో లక్షలకు లక్షలు అప్పులు చేస్తున్న వారికి కాస్త ఊరట లభించవచ్చూ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube