ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయంపై కాంగ్రెస్ అభిప్రాయం ఎలా ఉందంటే?

తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక నుండి మొదలుకొని గ్రేటర్ ఎన్నికలు, తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు, త్వరలో నాగార్జున సాగర్ ఎన్నికలు ఇలా వరుసబెట్టి ఎన్నికలు జరుగుతున్నాయి.అయితే ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

 No Hopes For Congress Party On Winning Mlc Elections,  Mlc Elections,  Congress-TeluguStop.com

అయితే ఎవరి స్థాయిలో వారు ఎన్నికలలో గెలవడానికి విశ్వ ప్రయత్నాలు చేసారు.కాని చివరిగా గెలిచేది ఒకరే కాబట్టి మిగతావారు ఓటమిని అంగీకరించక తప్పదు.

అయితే కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే కాంగ్రెస్ తెలంగాణలో నేతల కుమ్ములాటల వల్ల, అదే విధంగా ప్రజా సమస్యలపై ఘాటుగా స్పందించడంలో విఫలం అవడం వల్ల ప్రజల్లో నమ్మకం కోల్పోయారు.దాని ఫలితంగానే దుబ్బాక ఎన్నికలో, గ్రేటర్ ఎన్నికలో సత్తా చాట్టలేక పోయారు.
అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు పోటీ చేసినా ఎక్కడా మిగతా అభ్యర్థులకు పోటీ ఇచ్చినట్లు కనిపించలేదు.అయితే నిన్నటికే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.

అయితే ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం పట్ల కాంగ్రెస్ అంతగా నమ్మకం లేనట్లు కనిపిస్తోంది.చూద్దాం మరి కాంగ్రెస్ అభ్యర్థులకు పట్టభద్రులు పట్టం కట్టారా లేదా తెలియాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

అయితే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యారనేది పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube