ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఢమాల్...రిపేరు చేయాల్సిందేనా?

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎదురవుతుందని ఎవరూ ఊహించి ఉండరు.అయితే ఇది తమకు తాముగా చేసుకున్న వైఫల్యం అనేది కాంగ్రెస్ లో ఉన్న కొంత మంది నాయకులు అంగీకరిస్తున్న పరిస్థితి ఉంది.

 Congress Lost In Mlc Elections,dubbaka, Ghmc Elections, Telangna Elections, Cong-TeluguStop.com

అయితే దుబ్బాక ఉప ఎన్నిక నుండి మొదలుకొని గ్రేటర్ ఎన్నికల్లో చతికిల పడడం దగ్గరి నుండి తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల వరకు కాంగ్రెస్ ఎక్కడా సత్తా చాటినట్లు కనిపించని పరిస్థితి.అయితే ఈ పరిస్థితి కాంగ్రెస్ కు రావడానికి కాంగ్రెస్ లో ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించడం, అంతర్గత కుమ్ములాటలు అనేవి ప్రజల్లో కాంగ్రెస్ ను పలుచబడేలా చేసాయి.

అంతే కాక ప్రజల సమస్యలపై గట్టిగా పోరాటం చేయకపోవడంతో ప్రజలకు తమ సమస్యలను సభలో ప్రస్తావిస్తుందని ఆశపడ్డ ప్రజలకు కాంగ్రెస్ నాయకులు భరోసాను కల్పించలేకపోయారు.అందుకే వరుస ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ షాకిస్తూ తమ నిర్ణయాన్ని తెలుపుతున్నారు.

ఎమ్మెల్సీ అభ్యర్థులుగా చిన్నారెడ్డి, రాములు నాయక్ ఏ మాత్రం సత్తా చాటకుండానే వెనుదిరిగారు.ఇన్ని పరిణామాలు చూసాక అయినా కాంగ్రెస్ నాయకులు పార్టీకి రిపేరు చేయకపోతే ఇక కాంగ్రెస్ పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితిలా అయినా ఆశ్చర్యపోనక్కరలేదు.

ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కలిసి కట్టుగా ఉండి, కాంగ్రెస్ పటిష్టతకు పోరాడతారని ఆశిద్దాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube