'మహా' స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన కాంగ్రెస్ నేత  

Congress Mla Is The Maharastra Speaker-maharastra Politics,maharastra Speaker,uddav Dhakre

మహారాష్ట్ర రాజకీయాల్లో నిన్నటివరకు చోటుచేసుకున్న పరిణామాలకు తెరపడినట్లు అయ్యింది.మహా సీఎం పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారు అన్న ఉత్కంఠ కు తెరదించుతూ శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే ఎన్సీపీ,కాంగ్రెస్ ల మద్దతు తో సీఎం పీఠాన్నిఅధిరోహించిన విషయం తెలిసిందే.అయితే మహారాష్ట్ర స్పీకర్ గా ఎవరు ఎన్నికవుతారు అన్న ఉత్కంఠ కూడా తెరపడింది.ఈ పదవి కోసం కాంగ్రెస్ అభ్యర్థి నానా పటోలే ఎన్నిక ఏకగ్రీవం కావడం తో స్పీకర్ గా ఆయన భాద్యతలు స్వీకరించనున్నారు.

Congress Mla Is The Maharastra Speaker-maharastra Politics,maharastra Speaker,uddav Dhakre Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage-Congress MLA Is The Maharastra Speaker-Maharastra Politics Maharastra Speaker Uddav Dhakre

తొలుత స్పీకర్ అభ్యర్థిగా కిసాన్ థోరే ను బీజేపీ బరిలోకి దించగా స్పీకర్ పదవిని పోటీలోకి లాగరాదని పలువురు ఎమ్మెల్యేలు చేసిన విజ్ఞప్తి తో బీజేపీ తమ అభ్యర్థి విషయంలో వెనక్కి తగ్గడం తో నానా పటోలే ఎన్నిక ఏకగ్రీవమైంది.దీంతో పటేలే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రొటెం స్పీకర్ దిలీప్ వాల్సే పాటిల్ అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే ప్రకటించారు.

దీంతో పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ప్రతిపక్ష నేత దేవేండ్ర ఫడ్నవిస్ సహా ఎమ్మెల్యేలంతా నానా పటోలేకు అభినందనలు తెలిపారు.ప్రొటెం స్పీకర్, ముఖ్యమంత్రి స్వయంగా నానా పటోలేను స్పీకర్ చైర్‌‌ వరకూ తోడ్కొని వెళ్లి కూర్చోబెట్టడంతో సభలో అహ్లాదకర వాతావరణం కనిపించింది.

పటోలే విదర్భ ప్రాంతంలో పెద్ద పేరున్న నేత.బీజేపీ తిరుగుబాటు నేతగా ఆ పార్టీని వదిలి పెట్టిన పటోలే లోక్ సభ ఎన్నికల కు ముందు కాంగ్రెస్ పార్టీ లో చేరారు.