రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌  

Congress Minister Revanth Reddy Arrest - Telugu , Revanth Reddy, Revanth Reddy Arrest, Telangana Pragathi Bavan, Telangana Rtc Strike

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్‌ నాయకులు నేడు సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్‌ ముట్టడికి ప్రయత్నించారు.పలువురు కాంగ్రెస్‌ నాయకులు ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Congress Minister Revanth Reddy Arrest

ప్రగతి భవన్‌ ముట్టడి ప్రయత్నించిన పలువురు కాంగ్రెస్‌ నాయకులను మరియు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.బుల్లెట్‌ పై వచ్చిన రేవంత్‌ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.

ప్రగతి భవన్‌ వైపు వెళ్లకుండా ఆయన్ను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా కార్యకర్తలతో ముందుకు దూసుకు వెళ్లే ప్రయత్నం చేశాడు.

రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌-Political-Telugu Tollywood Photo Image

దీంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేశారు.

పలు పోలీస్‌ స్టేషన్‌ లకు తరలిస్తూ చివరకు కామాటిపుర పోలీస్‌ స్టేషన్‌లో ఆయన్ను ఉంచారు.ఆ తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై ఆయన్ను వదిలేశారు.

కాంగ్రెస్‌ నాయకులందరిని కూడా విడుదల చేయడం జరిగింది.ఈ సందర్బంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం వహరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు.

కేసీఆర్‌ నియంత పాలనతో ఆర్టీసీ కార్మికులతో పాటు అంతా కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నట్లుగా రేవంత్‌ రెడ్డి ఆరోపించాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు