చైనా యాప్స్ ని నిషేధించండి!

దేశ భద్రత, రక్షణ దృష్ట్యా చైనాకు సంబంధించిన టిక్ టాక్ సహా 59 యాప్స్ ని బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.మన దేశంలో చైనా యాప్స్ బ్యాన్ అవ్వడంతో ఇతర దేశాలు కూడా చైనాకు సంబంధించిన యాప్స్ బ్యాన్ చెయ్యాలి అనుకుంటున్నాయి.

 China Apps Ban,  Us Congress,  Us President Donald Trump, Congress Members , 25-TeluguStop.com

ఇంకా ఈ నేపథ్యంలోనే అమెరికాలో టిక్‌టాక్‌ తదితర చైనా యాప్‌లను బ్యాన్ చెయ్యాలని 24 మంది కాంగ్రెస్‌ రిపబ్లికన్‌ సభ్యులు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను కోరారు.

చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధం ఉన్న టిక్‌ టాక్ సహా మిగిత యాప్స్ ను అమెరికా మార్కెట్లోకి ప్రవేశించకుండా నిరోధించాలని చట్టసభ సభ్యులు ట్రంప్‌ ను కోరుతూ లేఖలో పేర్కొన్నారు.

అంతేకాదు.సైబర్‌ సెక్యూరిటీ చట్టాల బట్టి చైనా కంపెనీలు సామజిక మధ్యమ డేటాను అధికార కమ్యూనిస్టు పార్టీకి ఇవ్వాల్సి ఉంటుందని.

ఇది అమెరికా జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు ఉంటుందని లేఖలో రాసుకొచ్చారు.ఇంకా దీనిపై ప్రభుత్వం వారం రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు వైట్‌హౌస్‌ అధికారి మీడియాకు వెల్లడించారు.

కాగా భారత్ లో టిక్ టాక్ సహా చైనాకు సంబంధించిన 59 యాప్స్ బ్యాన్ చేసినప్పుడు ట్రంప్ సైతం టిక్ టాక్ బ్యాన్ చెయ్యాలనుకుంటున్నట్టు వ్యాఖ్య చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube