94 కాదు 100 ! కాంగ్రెస్ మార్క్ రాజకీయం అంటే ఇదేనేమో ..?

తెలంగాణాలో మహాకూటమి ఏర్పాటు చేసి టీఆర్ఎస్ వ్యతిరేఖ పార్టీలన్నిటిని ఒక్కటి చేసి .కొన్ని సీట్లు త్యాగం చేసి మరీ టీడీపీ , టీజేఎస్ , సీపీఐ తదితర పార్టీలను ఇందులో చేర్చుకుని యుద్దానికి సిద్ధం అయ్యింది.అయితే… మొదటి నుంచి కాంగ్రెస్ కూటమిలోని పార్టీలకు విలువ ఇస్తూ .వారు అడిగిన స్థానాలు కూడా ఇచ్చేందుకు సిద్ద పడుతూ వచ్చింది.అయితే… ఇప్పుడు నామినేషన్స్ వేసే చివరి రోజన మాత్రం కాంగ్రెస్ మార్క్ రాజకీయానికి తెరలేపింది.కూటమిలో పార్టీలకు వెన్నుపోటు పొడిచేలా రాజకీయం మొదలుపెట్టింది.

 Congress Mark Politics In Telangana Mahakutami-TeluguStop.com

తెలంగాణలో ఉన్న మొత్తం 119 స్థానాలలో కాంగ్రెస్ 25 స్థానాలను కూటమిలోని మిత్రపక్షాల కు ఇస్తున్నట్టుగా కూటమి ఏర్పాటు చేసిన కొత్తలో ప్రకటించింది .తాము కేవలం 94 స్థానాలలో పోటీ చేస్తామని గతంలో చెప్పింది.అయితే చివరికి వచ్చేసరికి ఈ 94 స్థానాలతో పాటు మరో ఆరు స్థానాలకు అభ్యర్థులకు బి ఫాం ఇచ్చింది.

అంటే… కాంగ్రెస్ మొత్తంగా వంద సీట్లకు పోటీ చేసేందుకు సిద్ధం అయ్యింది.అంతే కాకుండా… మిత్రపక్షాలకు ఇచ్చిన 19 సీట్లలో లో కూడా దాదాపు 7 సీట్లు ఎంఐఎం పార్టీ ప్రాబల్యం కలిగిన ప్రాంతాలు.అంటే కాంగ్రెస్ పార్టీ వదులుకున్న స్థానాలు కేవలం 12 అన్నమాట.

గతంలో ఇబ్రహీంపట్నం స్థానాన్ని టిడిపికి కేటాయిస్తూ ప్రకటన ఇచ్చింది.టిడిపి అధ్యక్షుడు రమణ, సామ రంగారెడ్డి కి ఇక్కడ నుంచి బి ఫాం ఇచ్చి ఉన్నారు.

ఇప్పుడు ఈ స్థానాన్ని మల్ రెడ్డి కి కేటాయిస్తూ బి ఫాం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.అలాగే కోదండరాం టీజేఎస్ పార్టీకి కేటాయించిన ఐదు స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టింది.

మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ కృష్ణయ్య కు టికెట్ ఇచ్చింది.ఇది గతంలో టీజేఎస్ పార్టీకి కేటాయించిన సీటు.అలాగే వరంగల్ లో కాంగ్రెస్ టీజేఎస్ పోటీకి నిలబడుతున్నగా, మహబూబ్ నగర్ లో టీజేఎస్, టిడిపి పోటీపడుతున్నాయి.ప్రస్తుతం ఈ రోజు నామినేషన్ లకు చివరి రోజు కాబడంతో అన్ని ప్రాంతాలల్లో కూడా చాలా మంది స్వతంత్ర అభ్యర్థులు నేడు, పార్టీల్లో ఆశవాహకులు, నేడు ఇండిపెండెుట్ లుగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

అయితే కాంగ్రెస్ మార్క్ వెన్నుపోటు రాజకీయం పై మాత్రం కూటమిలోని పార్టీలు గుర్రుగా ఉన్నాయి.కాంగ్రెస్ తో రాజకీయ స్నేహం అంటేనే ఇలా ఉంటుంది అనుకుంటూ … కాంగ్రెస్ చేసిన మోసంపై రగిలిపోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube