ఆ విష‌యంలో ప్ర‌శ్నించే ఛాన్స్ కోల్పోయిన కాంగ్రెస్‌.. టీఆర్ ఎస్‌కు ప్ల‌స్‌!

కొన్ని కొన్ని సార్లు కొంద‌రు నేత‌లు చేసే ప‌నులు త‌మ‌కు మేలు చేస్తాయ‌ని భావించిన అనుకోకుండా అవే ప‌నులు ఎదుటి పార్టీల‌కు కూడా ప్ల‌స్ అవుతుంటాయి.ఇప్ప‌టికే ఇలాటి ఘ‌ట‌న‌లు అనేకం చోటుచేసుకున్నాయి.

 Congress Lost The Chance To Question That .. Plus To Trs!, Revanth, Trs, Ramoji-TeluguStop.com

ఇక తాజాగా రేవంత్‌రెడ్డి చేసిన ప‌ని వ‌ల్ల కాంగ్రెస్‌కు ఓ అవ‌కాశం చేజారిపోయిన‌ట్ట‌యింది.అదేంటంటే ప్ర‌శ్నించే ఛాన్స్‌.

అవునండి ఒక‌ప్పుడు కేసీఆర్ చెప్పిన అనేక విష‌యాల్లో ఒక‌టి ఇంకా నెర‌వేర్చ‌లేదు.దాని గురించి ప్ర‌శ్నించొచ్చు అనుకునే లోపే రేవంత్‌రెడ్డి షాక్ ఇచ్చారు కాంగ్రెస్‌కు.

రేవంత్ టీపీసీసీ చీఫ్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత వ‌రుస‌గా కీల‌క నేత‌ల‌ను క‌లుస్తున్నారు.అంద‌రి స‌పోర్టు కోరుతూ వారి ఇండ్ల‌కు వెళ్లి మ‌రీ మ‌ద్ద‌తు కోరుతున్నారు.

ఇదే క్ర‌మంలో బెంగళూరుకు వెళ్లి మ‌ల్ల‌ఖార్జున ఖ‌ర్గేను, డీకే శివ‌కుమార్‌ను క‌లిసిన రేవంత్‌రెడ్డి అక్క‌డి నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు.ఇక ఆ త‌ర్వాత ఎవ‌రూ ఊహించ‌ని విధంగా రామోజీ ఫిల్మ్ సిటికి స్వ‌యంగా వెళ్లి మ‌రీ రామోజీ రావును క‌లిసి ఆయ‌న మ‌ద్ద‌తు కోరుతూ చాలాసేపు భేటి అయ్యారు కాంగ్రెస్ కొత్త‌బాస్‌.

Telugu @ktrtrs, @revanth_anumula, Ramoji Rao, Revanth, Revanthmeets, Ts Poltics-

ఈ భేటీపై ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది.అయితే రేవంత్ చేసిన ఈ ప‌నివ‌ల్ల టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు కొంత ప్ల‌స్ అయిన‌ట్టు తెలుస్తోంది.ఎందుకంటే తెలంగాణ రాక‌ముందు లక్ష నాగళ్ల‌తో తానే స్వ‌యంగా రామోజీ ఫిల్మ్ సిటీని దున్నుతానని గులాబీ బాస్ చెప్పిన విష‌యం తెలిసిందే.ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై విమ‌ర్శ‌లుచేస్తున్న కాంగ్రెస్‌కు తాజాగా రేవంత్ స్వ‌యంగా వెళ్లి రామోజీ రావును క‌ల‌వ‌డంతో ఆ ప్ర‌శ్న వేసే అవ‌కాశాన్ని కాంగ్రెస్ కోల్పియ‌న‌ట్ట‌యింది.

ఎందుకంటే ఒక‌వేళ ప్ర‌శ్నిస్తు టీఆర్ ఎస్ ఈ భేటీని వివ‌రిస్తూ కౌంట‌ర్లు వేసే ఛాన్స్ ఉంది.అంటే మొత్తానికి రేవంత్ రెడ్డి చేసిన ప‌ని కాస్త టీఆర్ ఎస్‌కు ప్ల‌స్ అయింద‌న్న‌మాట‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube