నోరు జారి : కాంగ్రెస్ ఓడిపోతుంది చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు   Congress Loses Chandrababu Sensational Comments     2018-12-02   22:52:52  IST  Sai M

రాజకీయ నాయకులు తమ ప్రసంగాల్లో నోరు జారడం సర్వ సాధారణమే. అయితే చిన్న చితకా నాయకులు తమ టంగ్ స్లిప్ అయితే పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ పెద్ద నాయకులు మాత్రం పొరపాటున నోరు జారితే మాత్రం అది పెద్ద సెన్సషనల్ న్యూస్ అయిపోతుంది. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన పుత్ర రత్నం లోకేష్ ను చూసి నేర్చుకున్నాడో ఏమో తెలియదు కానీ కూకట్ పల్లి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో నోరు జారి పరువు పోగొట్టుకున్నాడు.

కాంగ్రెస్ మిత్రపక్షం అనే సంగతి బాబుగారు మర్చిపోయారో ఏమో కానీ.. “కాంగ్రెస్ ఓడిపోతుంది” అని చంద్రబాబు అనేశారు. ఆ వెంటనే తప్పుని సరిదిద్దుకున్నారు. బీజేపీ ఓడిపోతుంది అని చెప్పుకొచ్చారు. శనివారం రాత్రి కూకట్‌పల్లిలో టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని తరఫున ప్రచారం నిర్వహించిన చంద్రబాబు.. రోడ్ షోలో ప్రసంగించారు. ఈ సమయంలో బీజేపీ ఓడిపోతుందని చెప్పడానికి బదులు కాంగ్రెస్‌ ఓడిపోతుందని వ్యాఖ్యానించారు.వెంటనే ఆ తప్పు సరిదిద్దుకున్నా…అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సోషల్ మీడియాలో బాబు గారి ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో హల్ చల్ చేస్తోంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.