ఢిల్లీ లో టిపీసీసీ పంచాయతీ ! ఆ ఇద్దరు నేతలూ అక్కడే 

ఎప్పటి నుంచో సాగుతూనే వస్తున్న తెలంగాణ పిసిసి అధ్యక్షుడి నియామక విషయం ఇప్పుడు ఫైనల్ స్టేజ్ కి వచ్చినట్లుగా కనిపిస్తోంది .ఎప్పటికప్పుడు ఈ నియామకంపై వార్తలు వస్తూనే ఉన్నా , అధిష్టానం కసరత్తు చేస్తూనే ఉన్నా,  ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో క్లారిటీ రాకపోవడం, పార్టీలో గ్రూపు రాజకీయాలు పెరిగి పోవడం వంటివి ఢిల్లీ అధిష్టానం పెద్దలకు తలనొప్పిగా మారింది.

 Tpcc, Telangana, Congress, Revanth Reddy, Komatreddy Venkat Reddy, Tpcc Chief Po-TeluguStop.com

దీని కారణంగానే ఎప్పటికప్పుడు ఈ పదవిని భర్తీ చేయకుండా వాయిదా వేస్తూ వస్తున్నారు.

Telugu Bhuvanagiri Mp, Congress, Congress Senior, Malkajgiri Mp, Revanth Reddy,

అయితే ఇప్పుడు మాత్రం సీరియస్ గానే ఈ పదవిని భర్తీ చేయాలని చూస్తున్నారు.కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా , దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కొత్త పిసిసి అధ్యక్షులతో పాటు కార్య వర్గాలను మార్చుతూ వస్తున్న కాంగ్రెస్ ఆ విధంగానే ఇక్కడ కూడా మార్పులు చేయాలని చూస్తోంది.ఈ పరిణామాల నేపథ్యంలోనే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఢిల్లీకి వెళ్లడం,  ఆ తరువాత రేవంత్ రెడ్డి వ్యక్తిగత పనుల మీద ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు.పైకి తన నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో చర్చించేందుకు కేంద్ర పెద్దలను కలుస్తున్నారని, సోనియాగాంధీ అపాయింట్మెంట్ సైతం తీసుకున్నారనే ప్రచారం ఒక వైపు జరుగుతుండగా, తనకే పిసిసి అధ్యక్ష పదవిని కేటాయించాలని విషయంపైనే అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీకి వెళ్లారని ప్రచారం జరుగుతోంది .ఇక రేవంత్ సైతం ఢిల్లీలోనే ఉండడంతో ఆయన కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిసి అధ్యక్ష పదవి విషయంలో తనకు ప్రాధాన్యం ఇవ్వాలనే విషయాన్ని గుర్తు చేసేందుకు ఈ పర్యటన పెట్టుకున్నారు అనే వాక్యాలూ వినిపిస్తున్నాయి.

Telugu Bhuvanagiri Mp, Congress, Congress Senior, Malkajgiri Mp, Revanth Reddy,

కాకపోతే ఇద్దరి నేతలతో పాటు,  మరికొంత మంది పేర్లను కాంగ్రెస్ పెద్దలు పరిశీలనలోకి తీసుకుని తెలంగాణ చెందిన పార్టీ సీనియర్లతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా మరికొద్ది రోజుల్లోనే తెలంగాణ కాంగ్రెస్ కి ఊపు తీసుకురావాలనే లక్ష్యంతో  కాంగ్రెస్ అధిష్టానం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube