ఆ పదవి కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య కోల్డ్ వార్

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకోకపోయినా … గెలిచిన ముఖ్య నేతలలో కొంతమంది మధ్య పోటీ వాతావరణం నెలకొంది.ఓ పదవి కోసం నాకు అంటే నాకు అంటూ కాంగ్రెస్ మార్క్ రాజకీయానికి తెరతీశారు.

 Congress Leaders War Fot Telangana Opposition Leader Post-TeluguStop.com

తెలంగాణ కాంగ్రెస్ లో ప్రతిపక్ష నేత పదవి కోసం పోటీ ఎక్కువయ్యింది.ప్రతిపక్ష నేతకు క్యాబినెట్ ర్యాంకు ఉండడం, ప్రభుత్వ పరంగా అన్ని సదుపాయాలు ఉండడంతో సహజంగానే ఈ పదవికి ఇంత డిమాండ్ ఏర్పడడానికి కారణం.

పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి తనకే ఆ బాద్యత ఇవ్వాలని కోరుతుండగా, పార్టీని విజయపదం వైపు నడిపించలేని నేతకు, భార్యనే గెలిపించలేని వ్యక్తికి ప్రతిపక్ష నేత పదవి ఇస్తారా అని ఆయాన వ్యతిరేక వర్గం ప్రశ్నిస్తోంది.అలాగే కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థిగా ప్రచారం పొందిన మల్లు భట్టి తనకు డిల్లీలో ఉన్న పరిచయాలతో… ఈ పదవి దక్కించుకోవాలని చూస్తున్నారు.కాగా మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా రంగంలో ఉన్నారట.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈ పదవి అప్పగించాలని ఆయన అనుచరులు కోరుతున్నారు.అయితే అధిష్టానం ఎవరివైపు మొగ్గుచూపుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube