సినిమాలా రాజకీయాలా ? ఆ పూజ తరువాతే విజయశాంతి క్లారిటీ ?  

Congress Leaders Tension over Vijayshanthi Silence, Vijayshanthi, Congress Leader, Special Poojas, Elections, Dubbaka Constituency - Telugu Congress Leader, Congress Leaders Tension Over Vijayshanthi Silence, Dubbaka Constituency, Elections, Special Poojas, Vijayshanthi

తెలంగాణలోని దుబ్బాక నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతి పేరుని ఆ పార్టీ నాయకులు జపిస్తున్నారు.ఆమె అక్కడి నుంచి పోటీ చేస్తే, పోటీ రసవత్తరంగా ఉంటుందని, టిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వడంతో పాటు సులువుగా విజయం సాధించవచ్చు అనే అభిప్రాయంలో ఆ పార్టీ నాయకులు ఉండగా, మొదట్లో విజయశాంతి సైతం దుబ్బాక నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించాలనే అభిప్రాయంతో ఉన్నట్టుగా కనిపించారు.

TeluguStop.com - Congress Leaders Tension Over Vijayshanthi Silence

కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ, దుబ్బాకలో పోటీ చేసేందుకు ఆమె అనాశక్తి చూపిస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

కాంగ్రెస్ నాయకులంతా, ఎన్నికలపై దృష్టి పెట్టి ఏ విధంగా విజయం సాధించాలనే విషయంపై దృష్టిపెట్టి పనిచేస్తుంటే, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్న ఆమె మాత్రం మౌనంగా ఉండిపోవడం పార్టీ శ్రేణులకు సైతం అర్థం కావడం లేదు.

TeluguStop.com - సినిమాలా రాజకీయాలా ఆ పూజ తరువాతే విజయశాంతి క్లారిటీ -Political-Telugu Tollywood Photo Image

అయితే ఆమె కు సినిమా ఆఫర్లు కూడా ఎక్కువగా వస్తుండడంతో, సినిమాల వైపు వెళ్ళిపోతారు అనే ప్రచారం జరుగుతోంది.అయితే ఆమె మాత్రం సినిమాల వైపు వెళ్లాలా ? లేక రాజకీయాల్లోనే కొనసాగాలనే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

అదీ కాకుండా, ఆమె ప్రస్తుతం కొన్ని ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇది పూర్తయిన తర్వాత సినిమాల వైపు వెళ్లాలా రాజకీయాల వైపు వెళ్లాలా అనే విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.సాధారణంగానే విజయశాంతి ఎప్పుడూ, పార్టీ కార్యక్రమాలలో పెద్దగా పాల్గొనేందుకు ఇష్టపడరు.అసలు రాష్ట్ర నాయకత్వంతో సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు.ఏ వ్యవహారమైనా ఢిల్లీ వెళ్లి, పార్టీ పెద్దలను కలుస్తూ, ఎక్కువగా వారితోనే టచ్ లో ఉంటూ వస్తున్నారు.2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం తప్పకుండా దక్కుతుందని అభిప్రాయం ఉండడంతో, గట్టిగానే ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

కానీ ఫలితాలు నిరాశ కలిగించడంతో, ఆమె ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.ఆమె బిజెపి వైపు వెళ్ళిపోతారు అనే ప్రచారం కూడా జరిగింది.కానీ ఏ వ్యవహారంపైనా, విజయశాంతి స్పందించడం లేదు.ఈ పూజ పూర్తి అయిన తరువాత విజయశాంతి ఏ బాంబ్ పేల్చుతారో తెలియక కాంగ్రెస్ నాయకులంతా టెన్షన్ గా ఉన్నారు.

#Special Poojas #CongressLeaders #Vijayshanthi #Elections #Congress Leader

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Congress Leaders Tension Over Vijayshanthi Silence Related Telugu News,Photos/Pics,Images..