కాంగ్రెస్ లో తుఫాన్ కు ఆ విందే కారణమా ?

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న దుస్థితి, భవిష్యత్తు లోను బీజేపీ వంటి బలమైన పార్టీని ఎదుర్కొనే బలం లేకపోవడం, ముందు ముందు కేంద్రంలో చక్రం తిప్పడం అసాధ్యం అనే అభిప్రాయం ఇప్పటికే, చాలామంది నాయకుల్లో వచ్చేసింది.అదీ కాకుండా గాంధీ కుటుంబం కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటేనే గాంధీయేతర నాయకులు పార్టీ అధ్యక్షుడిగా ఉంటేనే, తిరిగి కాంగ్రెస్ కు పునర్వైభవం వస్తుందని ప్రియాంక గాంధీ సైతం అభిప్రాయపడడం, ఆ తర్వాత పార్టీకి చెందిన అత్యంత సీనియర్ నాయకులు 23 మంది కాంగ్రెస్ అధ్యక్షుడి విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలని, పార్టీలో అనేక సంస్కరణలు చేయాలంటూ లేఖ రాయడం కాంగ్రెస్ పార్టీలో పెద్ద తుఫాను రేపింది.

 Congress Senior Leaders Meeting At Shashi Tharoor Home, Congress Senior Leaders,-TeluguStop.com

ఈమేరకు సిడబ్ల్యుసి సమావేశంలో ఈ వ్యవహారంపై చర్చ జరగగా, మెజారిటీ నాయకులు సోనియా గాంధీనే మరికొంత కాలం పాటు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించాలి అంటూ తీర్మానించారు.ఈ వ్యవహారంతో కాంగ్రెస్ లో చెలరేగిన తుఫాను చల్లారిపోయింది అనే అభిప్రాయానికి వచ్చేశారు.

అయితే 23 మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు అధిష్టానానికి లేఖ రాయడానికి అసలు కారణం ఏంటి ? ఈ వ్యవహారం ఎక్కడ మొదలైంది అనే అభిప్రాయం ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది.కేంద్ర మాజీ మంత్రి, కేరళకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు శశిధరూర్ ఇంట్లో జరిగిన విందు సమావేశంలో ఈ వ్యవహారంపై చర్చ జరగగా, మెజారిటీ నాయకులు సోనియాకు లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Telugu Congress Senior, Congresssenior, Cwc, Letter, Sonia Gandhi, Soniarahul-Te

లేఖ రాసే విషయంలో విందుకు హాజరైన సీనియర్ నాయకులంతా మద్దతు పలికినట్లు తెలుస్తోంది.ఇక ఈ విందులో మాజీ మంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం, సచిన్ పైలెట్, అభిషేక్ మను సింఘ్వి మరి కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది.సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరిని శశిధరూర్ విందుకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది.ఈ సమావేశంలోనే కాంగ్రెస్ లో పెను మార్పులు రావాల్సి ఉందని, అనేక సంస్కరణలు చేపట్టకపోతే పార్టీకి భవిష్యత్తు ఉండదనే అభిప్రాయంతో నేతలంతా మూకుమ్మడిగా నిర్ణయం తీసుకుని, సోనియాకు లేఖ రాయాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ తెలిపారు.

Telugu Congress Senior, Congresssenior, Cwc, Letter, Sonia Gandhi, Soniarahul-Te

ప్రస్తుతం కాంగ్రెస్ లో ఈ లేఖ వివాదం ప్రస్తుతానికి సర్దుమణిగినట్టుగా కనిపించినా, ముందు ముందు అనేక వ్యవహారాలపై ఇదే త్వరగా అసంతృప్తి జ్వాలలు అలుముకునే ప్రమాదం లేకపోలేదు.ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం పార్టీని ముందుకు నడిపించడంలో విఫలమవుతోందనే అసంతృప్తి పార్టీ నాయకుల్లో వచ్చేసింది.ఇక కాంగ్రెస్ అధిష్టానం కూడా పార్టీ నేతలు ఎవరూ చేజారిపోకుండా, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ అడుగులు వేస్తోంది.పార్టీ సీనియర్లు ఈ విధంగా వ్యవహరిస్తున్నా వారిపై చర్యలు తీసుకునే పరిస్థితి ఇప్పట్లో లేనట్టుగానే కాంగ్రెస్ పరిస్థితి ఉంది.

ఇక కాంగ్రెస్ అధిష్టానం కూడా పార్టీ నేతలు ఎవరు జారిపోకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు పరిస్థితులు అంచనా వేసుకుంటూ వస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube